Ambati Bail | మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్, విడుదల
Ambati Bail | వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కు బెయిల్ దొరికింది. దీంతో బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
అమరావతి : వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) కు బెయిల్ ( Bail ) దొరికింది. దీంతో బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ రోజున లక్కీడ్రాలో అవకతవకలకు పాల్పడ్డారని చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు రాంబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అంతకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టు చేసి జైలులో ఉంచగా అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది . అయితే వెంటనే లక్కీ డ్రా కేసులో మళ్లీ అరెస్టు చేశారు. గత 18 రోజులుగా అంబటి జైలులో ఉన్నారు. అంబటి జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు.
తన ఇంటిపైన దాడి చేశారని, హింసించారని, భార్య, పిల్లలను తరిమారని ఆరోపించారు. అయినా వాటిని లెక్క చేయనని స్పష్టం చేశారు. ప్రజలు, ధర్మం తన వెంటే ఉన్నారని, పైన దేవుడు ఉన్నాడు. అన్నింటికి ఒకరోజు సమాదానం చెబుతాడని అన్నారు. ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని, బాధితులను జైలులో పెట్టి, క్రిమినల్స్ను బయట తిరుగనిస్తున్నారని దుయ్యబట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

