గద్వాల, జనవరి 4 : జిల్లాలో విద్యా, వైద్యం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్నదని జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నూతన క లెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం మీడియాతో మా ట్లాడారు.
అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చే సుకుంటూ జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. అధికారులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేకదృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు నిర్ల క్ష్యం వహించొద్దని, లేదంటే చర్యలు తప్పవన్నారు.