నాగర్‌కర్నూల్, జనవరి 22 : మండలంలోని పులిజాల గ్రామ మాజీ సర్పంచులు వెంకటయ్య, చంద్రయ్యతోపాటు మరో 50 మంది నాయకులు, కార్యకర్త లు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. అలాగే బీజేపీ గ్రామ యూత్ లీడర్ జగన్మోహన్రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మె ల్యే నివాసంలో మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా.. బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరం గా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అం దరి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అ భివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
ఎనిమిదేండ్లుగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టామని తెలిపారు. వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, అలాంటి సంక్షేమాన్నే దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.