మహబూబ్నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 3 : ఉమ్మ డి పాలమూరు జిల్లాకు చెందిన అధ్యాపకుల వినూత్న ఆ విష్కరణకు ఇంటలెక్షువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా డిజైన్ సర్టిఫికెట్ లభించినట్లు పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ తెలిపారు. గురువారం పీజీ కళాశాలలో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిమోట్ పరికరం విధానంలో పనిచేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను రూపొందించడంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యాపకులు విజయం సాధించారన్నారు.
ఫైథాన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి తయారు చేసిన ఈ పరికరంతో రోగికి గరిష్ఠ మోతాదులో ఆక్సిజన్ అందించవచ్చన్నారు. ఆక్సిజన్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించడం, హెచ్చుతగ్గులను సర్దుబాటు చేయడంతోపాటు రోగి వ్యక్తిగత అవసరాలను తీరుస్తుందన్నారు. మొబైల్ ద్వారా నియంత్రించేందుకు వీలుంటుందన్నారు. ఈ పరికరం తయారీలో మొత్తం ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా, అందులో ముగ్గురు పాలమూరువాసులు కావడంతో పాలమూరు యూనివర్సిటీకి న్యాక్ గ్రేడింగ్తోపా టు భవిష్యత్తు సైంటిస్టులుగా అధ్యాపకులు గుర్తింపు పొం దుతారని పేర్కొన్నారు.
పాలమూరు విశ్వవిద్యాలయంలోని మ్యాథమెటిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.మధు, కొల్లాపూర్ పీజీ కాలేజ్ మ్యాథమెటిక్స్ విభా గం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.భారతి, జోగుళాంబ గద్వాల ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మ్యాథమెటిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.సత్తెమ్మ ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిలో హైదరాబాద్ వాక్జెన్ యూనివర్సిటీ ముంజం శంకర్రావు, భువనేశ్వర్ సీవీరామన్ గ్లోబ ల్ యూనివర్సిటీ లిపిక పానిగ్రాహి, మేడ్జల్ నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఎస్.అరుంధతి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీయూ గణితశాస్త్ర విభాగం అధ్యాపకుడు మధును ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, పీయూ పీఆర్వో శేకుంటి రవికుమార్, అధ్యాపకులు అభినందించారు.