దామరగిద్ద / మాగనూర్: పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గాన్ని బలిచేసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సార్వత్రిక ( Strike ) సమ్మె దామరగిద్ద ( Damaragidda), మాగనూర్ ( Maganoor ) లో విజయవంతమైంది. టీయూసీఐ, సీఐటీయూ, ఆధ్వర్యంలో దామరగిద్ద మండల కేంద్రంలోని భవాని గుడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు.
ఏఐయూకేఎస్ (AIUKS) జిల్లా నాయకులు పెద్దింటి తాయప్ప, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నారెడ్డిలు , సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నాయకులు పెద్దింటి రామకృష్ణ, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు హాజిమలాంగ్ , సీఐటీయూ మండల కార్యదర్శి జోషి, రైతు సంఘం నాయకులు రామకృష్ణ, మాట్లాడారు.
కార్మికవర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకొన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తీసుకురావడం దారుణమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ నాయకులు వెంకటేష్ , ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా ఉపాధ్యక్షులు మధు , మహేష్, అంజి, భాస్కర్, రాజు పీడీఎస్యూ నాయకులు భీమేష్ , వెంకటేష్, అనిల్ ,తదితరులు పాల్గొన్నారు.
మాగనూరు జాతీయ రహదారిపై ధర్నా..
మాగనూరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన కార్మికులు నిలిచిపోయిన వాహనాలు
కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాగనూర్ మండల కేంద్రంలో అంతరాష్ట్ర రహదారిపై ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు , సీపీఎం సీనియర్ నాయకులు భరత్ కుమార్ మాట్లాడారు. లక్షల కోట్ల రూపాయలు బడా పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ ప్రకటిస్తున్న ప్రభుత్వాలు 24 గంటల పాటు వైద్య, విద్య ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్న అంగన్వాడీ , ఆశా, మధ్యాహ్న భోజన, కార్యకర్తలకు కనీస వేతనం రూ. 26 వేల రూపాయలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు రామలింగమ్మ, అయేషా, ఎల్,లలిత, మధ్యాహ్న భోజన కార్మికులు మైముద ,ప్రమీల,ఉమాదేవి, లలిత ,ఆశ యూనియన్ జిల్లా కార్యదర్శి గౌరమ్మ ,మండల అధ్యక్షురాలు అనురాధ, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు అశోక్ , వీవోఏల సంఘం అధ్యక్షులు పుంజనూర్ బాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కోల్పూర్ నర్సింలు, ఆటో యూనియన్ నాయకులు నామాలి తిమ్మప్ప , రైతు సంఘం నాయకులు వాకిటి వెంకటయ్య, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే నర్సింలు, సీఐటీయూ నాయకులు బ్యాగరి నర్సింలు పాల్గొన్నారు.