మాగనూరు/కృష్ణ, డిసెంబర్ 19 : తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా రైతుల మధ్య ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ నడుస్తున్నది. కొద్దిరోజులుగా కర్ణాటక రాష్ట్రం లో పండించిన ధాన్యాన్ని తెలంగాణలో అమ్మకానికి తీసుకురాగా.. అధికారులు, పోలీసులు బార్డర్ చెక్‌పోస్ట్‌ల వద్ద వాహనాలను అడ్డుకొని వెనకి పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులు గురువారం కర్ణాటకలోని రాయిచూరుకు ధాన్యం లోడుతో వెళ్తున్న వాహనాలను నారాయణపేట జిల్లా కృష్ణ బార్డర్ చెక్‌పోస్ట్ వద్ద కర్ణాటక రైతులు అడ్డుకున్నారు.
తమ ధాన్యాన్ని తెలంగాణలోకి అనుమతిస్తేనే.. వారి ధాన్యాన్ని తమ రాష్ట్రంలోకి పంపించాలంటూ నిరసన తెలిపారు. తెలంగాణలో క్వింటాకు రూ.2,320తోపాటు రూ.500 బోనస్ కలిపి రూ.2,820 మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలో అమలు కాకపోవడంతో రైతులు ధాన్యాన్ని నెలల తరబడి కల్లాల్లోనే ఆరబెడుతుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో బోనస్ ఇవ్వకపోవడంతోపాటు డబ్బులు నెలలుగా పెండింగ్‌లో ఉంటున్నాయని రైతులు వాపోతున్నారు. కర్ణాటక వ్యాపారులతో ఇక్కడి రైతులు పెట్టుబడి కోసం డబ్బులు తీసుకొని సాగు చేశారు.
దీంతో వ్యాపారులకు ధాన్యాన్ని అమ్మిన వెంటనే డబ్బులిస్తుండడంతో తెలంగాణ రైతులు కర్ణాటకలోని రాయిచూరు మారెట్లో ధా న్యాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ధాన్యాన్ని కర్ణాటకలో అమ్ముకునేందుకు వీలులేదంటూ గురువారం ఉదయం ఏడు గంటలకు 60 నుంచి 70 ట్రాక్టర్లు, బొలెరో వాహనాలను కృష్ణ మండలం వాసునగర్ చెక్‌పోస్ట్ వద్ద రైతు సంఘం కర్ణాటక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్యామరస మాలిక్ పటేల్, ఎన్.మల్లికార్జున్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది రైతులు అడ్డుకున్నారు.
కర్ణాటకలో పండించిన ధాన్యాన్ని తెలంగాణలోకి రాకుండా అధికారులు అడ్డుపడుతుండడంతో వారికి ఆగ్రహం తెప్పించడంతో ఆందోళనకు దిగారు. దీంతో నారాయణపేట జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల నుంచి వచ్చిన ధాన్యం వాహనాలు ఎకడికకడ బారులుదీరాయి. తమ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని తెలంగాణలో అనుమతిస్తే.. కర్ణాటకలోకి తెలంగాణ వాహనాలను పంపిస్తామని రైతులు భీష్మించుకు కూర్చున్నారు.
మధ్యాహ్నం 12:30 వరకు ఇటు కర్ణాటక, అటు తెలంగాణ అధికారులు, రాజకీయ నాయకులు రైతుల మధ్య నెలకొన్న పంచాయితీని పరిషరించేందుకు చొరవ చూపకపోవడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. రైతుల పక్షాన ఎవరూ నిలవడంలేదని, తమను పట్టించుకునే నాథుడే లేడంటూ నిట్టూర్చారు. ఇప్పటి నుంచి కర్ణాటకలోకి తెలంగాణ ధాన్యం రావాల్సిన అవసరమే లేదని, ఒకవేళ వస్తే ఎకడి వాహనాలు అకడే నిలిపేస్తామని కర్ణాటక రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
వాసునగర్ చెక్‌పోస్ట్ వద్ద కర్ణాటక రైతుల ధాన్యాన్ని సైతం అడ్డుకున్నారు. తెలంగాణ బార్డర్ సమీపంలో ఉన్న దుప్పలి, బద్దిపల్లి, కడెచూడు, సైదాపూర్ గ్రామాల నుంచి వచ్చిన కర్ణాటక రైతులను తెలంగాణ రైతులతో పాటు నిలిపివేశారు. కర్ణాటక రైతులను కూడా వెనుదిరిగి పంపించడంతో కృష్ణ చెక్‌పోస్ట్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూశారు. కర్ణాటక రాష్ర్టానికి చెందిన ఆధార్ కార్డు, ఇతరత్రా పత్రాలను చూపించినా అనుమతించకపోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.
తెలంగాణలో వడ్లు అమ్ముకోవడానికి బాధలేదు. కానీ అమ్మిన డబ్బులు త్వరగా రావడం లేదు. అప్పు చేసి వరి పంట సాగు చేశా. కూలీలకు మాట ఇచ్చా. పంట అమ్మి న తర్వాత డబ్బులు ఇస్తానని. మాట ఇచ్చా ను. తెలంగాణలో రైతుబంధు రాలేక.. రు ణమాఫీ కాలేక అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నా. అందుకే కర్ణాటకకు తీసుకెళ్లి అమ్ముకొని డబ్బులు ముట్టిస్తా.
– తిమ్మప్ప, రైతు, మక్తల్ మండలం
వరి పంట వేసుకోడానికి రూ.1.50లక్షలు రాయిచూర్‌లోని శావుకారితో అప్పు తెచ్చుకున్నా. వడ్లు అమ్మి అప్పు తీరుద్దామ ని రాయిచూరుకు వడ్లు తీసుకెళ్తుంటే కర్ణాటక రైతులు, పోలీసులు అడ్డుకుంటుండ్రు. తెలంగాణ వడ్లు కర్ణాటక రావొద్దని.. ఇలా అడ్డుకుంటే వడ్లు అమ్మేది ఎప్పుడు.. అప్పు తీర్చేది ఎప్పుడు. రైతులకు రైతుబంధు కూడా రాలేదు
అప్పు తీరుద్దామంటే..
– నర్సింహ, రైతు, నర్వ మండలం
మాది మక్తల్ మండలం పంచదేవ్ పా డు. మేము 5ఎకరాల్లో వరి పంట సాగు చేశాం. తెలంగాణ ప్రభుత్వానికి 250 వరి బస్తాలు అమ్మి నెలరోజులైనా డబ్బులు రాలేదు. ఓ పక కూలీలు డబ్బులు చె ల్లిం చాలి. పంటల కోసం అప్పు చేసుకు న్నాం. గత ప్రభుత్వమైతే పంటలు వేసుకోక ముం దే రైతుబంధు వేసింది. ఇప్పుడైతే మాకు రుణమాఫీ కాలేదు. రైతుబంధు రాలేదు.
– వెంకటేశ్, రైతు, పంచదేవ్పాడు