రేవంత్.. ఖబడ్దార్
: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవా రం దేవరకద్రలో బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి గల్లీ లీడర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
- దేవరకద్ర, కొత్తకోటలో సీఎం దిష్టిబొమ్మ దహనం
దేవరకద్ర, ఫిబ్రవరి 6 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవా రం దేవరకద్రలో బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి గల్లీ లీడర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకే బీఆర్ఎస్ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారం టూ మండిపడ్డారు. పాలన చేతకాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడు తున్నారన్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన రెండు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నదన్నారు. కేసీఆర్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని వివరించారు. కేసీఆర్ తన ప్రా ణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణను సాధించారన్నారు. అసహనంతో ఆరోపణలు చేస్తే హస్తం పార్టీ నాయకులను ప్రజ లు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరిమికొడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌యాదవ్, ఆంజనేయులు, వెంకటేశ్, రాందాస్, చల్మారెడ్డి, యుగేంధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాధాకృష్ణ, జక్కి, రాము, ఆంజనేయులు, భార్గవ్ ఉన్నారు.
అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా..
కొత్తకోట, ఫిబ్రవరి 6 : కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా పాలెం గ్రామంలో బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశా రు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్యారెంటీల మాటున గద్దెనెక్కారన్నారు. ఇప్పటి వ రకు రైతుబంధు నిధులు కూడా విడుదల చేయ లేని అసమర్థ పాలన కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. గ్యారెంటీలు అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో నాయకులు సత్యనారాయణ, వెంకట న్న, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

