మక్తల్, ఫిబ్రవరి 12 : వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న రైతన్న జీవితంలోకి పేట-కొడంగల్ ఎత్తిపోతల పథ కం వచ్చి రైతులను నట్టేట ముంచిన సంఘటన మరువక ముందే రైతులు సాగుచేసిన పంటను నేలపాలు చేసిన సంఘటన గురువా రం మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గానికి సాగునీటిని తీసుకువెళ్లాలని, మక్తల్ నియోజకవర్గంలోని భీమా పేజ్-1లో అంతర్భాగమైన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా తన నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు చాలీచాలని పరిహారం అందించిన రేవం త్‌రెడ్డి, ప్రస్తుతం కాట్రేపల్లి శివారులో, రైతులు యాసంగి సీజన్లో పంటలను సాగు చేసుకున్నప్పటికీ, పం ట చేతికొచ్చే సమయం వరకు సం బంధిత గుత్తేదారులు ఆగకుండా, రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే, రైతుల పొలా ల్లో జేసీబీలను దింపి, ప్రాజెక్టు పనులను ప్రారంభించడం జరిగిందని రైతు లు వాపోయారు.
గతంలోనే భూత్పూర్ రిజర్వాయర్‌లో వందలాది ఎకరాలు కోల్పోయి న రైతులకు, గుదిబండ లాగా, రేవంత్ రెడ్డి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ప్రారంభించడంతో ఉన్న కాస్త భూములను కూడా రిజర్వాయర్‌లో పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం అం దించకుండానే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల కోసం సం బంధిత గుత్తేదారు గురువారం రైతుల పంట పొలాలలోకి భారీ జేసీబీలను పంపి పంప్ హౌస్నిర్మాణ పనులను ప్రారంభించడం చూ స్తుంటే వీరికి పొలంలో ఉన్న రైతుల ప్రాణాలు కూడా లెకచేయకుండా పనులు చేపట్టేలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.