మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 14: విద్యుత్ ఆర్టిజన్ల కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే.. ఈ ప్రభుత్వం మెడలు వంచి పని చేయించుకుంద్దాం.. బెదిరిస్తే.. బెదరమని చెప్పండి.. మీకు అండగా మేమున్నాం.. అంటూ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆర్టిజన్లకు భరోసా ఇచ్చారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్, అన్ మ్యాండ్, పీస్ రేటు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహబూబ్‌నగర్ విద్యుత్ కార్యాలయం ఎదుట ఆర్జిజన్లు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 7వ రోజుకు చేరుకుంది.
ఈ సమ్మెకు శ్రీనివాస్‌గౌడ్ సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు బీఆర్ఎస్ హయాంలో వచ్చిం దన్నారు. మన పిల్లలు బాగుపడాలని ఎంతో ఆరాటపడ్డాం.. ఇతర రాష్ర్టాలకు విద్యుత్ అమ్మె స్థాయికి ఎదిగివాళ్లం.. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయని ప్రతి ఒక్కరు మేల్కొని ఉద్యమించాలన్నారు. కాంట్రాక్టర్ల కింద పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు బీఆర్ఎస్ హయాంలో వచ్చిందన్నారు. ఫస్ట్ పీఆర్సీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకే అయ్యిందని, దాంతోనే విద్యుత్ ఉద్యోగుల వేతనాలు పెరిగాయన్నారు.
ఆర్టిజన్లతో పెట్టుకుంటే కరెంట్ షాక్‌తో కిందపడ్డట్లు కావాలని అన్నారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుంటే కుటుంబాలతో సహా హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం చేపట్టాలని కలిసి కట్టుగా పోరాడితేనే విజయం సాధిస్తామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కావాలనే మొండి వైఖరి ప్రదర్శిస్తే విస్తృత స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడదామని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే మీ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ధర్నా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్టిజన్లు, విద్యుత్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, ఏప్రిల్ 14 : విద్యుత్ ఆర్టిజన్లు, పీస్ రేట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ విద్యుత్ ఉద్యోగులను విద్యుత్‌శాఖలో పూర్తిస్థాయిలో విలీనం చేశారని, కానీ నేటి ప్రభుత్వం వారి ముఖ్యమైన కోర్కెలు తీర్చకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో దీక్షా శిబిరాలను సందర్శించి చాయ్ తాగినంత సమయంలో మీ సమస్యలు పరిష్కరిస్తానని మోసం చేసి ఓట్లు దండుకున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విడిపోయారని అన్నారు. వెంటనే తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్లు ఎంప్లాయీస్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, లక్ష్మయ్య, రమేష్శ్గౌడ్, అశోక్, బాలపీరు, పరంజ్యోతి, మురళీసాగర్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, తిరుమల్, గులాంఖాదర్, జాగృనాయక్, జోహెబ్ భుస్సే న్, ఇమ్రాన్, రహీం, అ సద్, రాము, హరీశ్, సు రేశ్, రాము, కవితానాయక్ , మహేశ్వర్‌రెడ్డి, ముద్దుసార్, అలీం, శ్రీనివాసులు, గిరి, హేమంత్,భాగ్యరా జు, ఇమ్రాన్, స య్యద్, జమీల్, అస్లాం, శివగౌ డ్, రాహుల్, లక్ష్మణ్‌గౌడ్, వంశీ, రా హుల్, ము నికుమార్, ఖాదర్ పాల్గొన్నారు.