గద్వాల, జూన్ 25 : గద్వాల గంట గేరికి చెందిన జయరాములు సర్వే డిపార్ట్మెంట్లో పని చేసి రిటైర్డ్ అయ్యారు. జయరాములు, శకుంతలకు ఇద్దరు కుమారులు తేజేశ్వర్, తేజవర్ధన్, ఓ కూతురు రమాదేవి ఉన్నారు. కూతురుకి పెండ్లి చేయ గా ఇద్దరు కొడుకులతో కలిసి సుఖంగా జీవిస్తున్నారు. తండ్రి సర్వేకు వెళ్లే సమయంలో తేజేశ్వర్ తండ్రి వెంట వెళ్లి సర్వే చేయడం నేర్చుకున్నాడు. దీంతోపాటు ఖాళీ సమయంలో విద్యార్థులకు డ్యాన్స్ నేర్పించేవాడు. సుఖంగా జీవనం సాగిస్తున్న ఆ కుటుంబలోకి కోడలు రూపంలో ఐశ్వర్య ఎంట్రి అయింది.
అంతా మంచే జరుగుతుందన్న ఆ కుటుంబలో కోడలు రూపంలో వచ్చిన ఐశ్వర్య కర్కశరాలుగా మారి ప్రియు డి మోజులోపడి కట్టుకున్న భర్తనే కాటికి పంపడానికి సుఫారి ఇచ్చి ప్రియుడితో కలిసి కట్టుకున్న వాడినే కడతేర్చి సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో విషాదఛాయలు నింపింది. కడు పు కోతతో ఆ వృద్ద దంపతులు తల్లడిళ్లుతున్నారు.. వారి ఆవేదన వారి మాటల్లో.. మా కోడలు నా కొడుకును మాయమాటలతో మోసం చేసింది. నీవు లేకుంటే నేను లేను నీవు న న్ను అపార్థం చేసుకుంటున్నావని, మన మధ్యలో ఎవ రూ ఉండకూడదని మా యమాటలు చెప్పి బు ట్టలో వేసుకుంది.
మా కో డలు(ఐశ్వర్య అలియా స్ సహస్ర)మాటలు నమ్మి న నా కుమారుడు ఆమె నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి పెండ్లి చేసుకున్నాడు. పెండ్లి చేసుకున్న తర్వాత మా కోడలు అసలు రూపం బయటపడ్డది. ఐశ్వర్య, తేజేశ్వర్‌కు పెళ్లి కుదిర్చాం. పెళ్లి ఐదు రోజులు ఉండగా ఐశ్వర్య పెళ్లికు ముందు ప్రియుడితో లేచిపోయిం ది. ఈ సమయంలో ఇరు కుటుంబాలు మాట్లాడుకొని ఓ ఒప్పం దం చేసుకున్నాం.. పెళ్లి కూడా రద్దు చేసుకున్నాం. ఇద్దరు వేరు వేరుగా ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చని, అగ్రిమెంట్ రాసుకున్నాం. అంత సవ్యంగా ఉందనుకున్నాం. ఈ సమయంలో ఐశ్వర్య మా కుమారుడికి మాయమాటలు చెప్పి తిరిగి
రించేలా చేసింది. మా కోడ లు తన మనస్సులో ఒకటి పెట్టుకొని అయిష్టంగానే పెం డ్ల్లి చేసుకుంది. పెళ్లి రద్దు చే సుకొని, మా బిడ్డ మా మాట విని ఉంటే ఇలా జరిగేది కా దేమో.. మా బిడ్డా మా మా ట విని ఉంటే బతికే వా డేమో.. మమ్మల్ని మంచిగా చూసుకునేటోడ్ని మట్టిలో కలిపేశారు. ఇక మాకు దిక్కెవరు అంటూ తేజేశ్వర్ తల్లిదండ్రులు జయరాములు, శకుంతల రోదన కాలనీ వాసులను కంట తడి పెట్టిస్తుంది. మా బి డ్డను మాటలతో మాయ చేసి నమ్మించి గొంతే కోశారు. మా బిడ్డ సర్వే పనికి ఎక్కడికి వెళ్లినా సాయంత్రానికి ఇంటికి వచ్చేవా డు.
రాత్రైనా ఇంటికి రాకపోవడంతో మా మనస్సులో ఆందోళన మొదలై పోలీసులకు ఫిర్యాదు చేశాం. నా కోడలు భర్త చనిపోయాడని తెలిసినా మాకు ఒక్కమాట చెప్పలేదు. ఏమి తెలియని దాని లాగా ఉదయం లేచి దేవుడికి దీపం పెట్టి మా బిడ్డను దేవుడి దగ్గరకు పంపించింది అంటూ రోదనతో తమ బాధను వెళ్లగక్కుతున్నారు. తమ బిడ్డతో సంసారం చేయడానికి ఇష్టం లేకపోతే వదిలి పుట్టింటికి వెళ్లాల్సింది. అమాయకుడైన తమ బిడ్డను చంపాల్సిన అవసరం ఏముంది? తమ బిడ్డను చంపి తమకు కడుపు కోత మిగిల్చారు’..అంటూ త ల్లిదండ్రుల రోదనలు కలచివేస్తున్నాయి. బిడ్డ ప్రాణాలు తీ సిన వారికి ఇదే గతి తప్పదని శాపనార్థాలు
నా బిడ్డను నమ్మించి గొంతు కోశారు. మా కోడలు కుటుంబం అంతా నటన బ్యాచ్. వారి నటనలో తమ కుమారుడు మోసపోయి మాకు ఘోస మిగిల్చాడు. మేము చెప్పినట్లు విని ఉంటే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు చేత కాదు.. ఏ పని చేయలేక పోతున్నా.. నా కుమారులే నా బాగోగులు చూసుకునే వారు. ఇప్పుడు నా పరిస్థితి దయనీయంగా మారింది. మాకు దిక్కెవరు. ఇటువంటి కుటుంబాలను సమాజం నుంచి వెలివేసి కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఏ ఆడపిల్ల ఇటువంటి చర్యలకు పాల్పడదు. నా కొడుకును ఎట్లగా చంపారో వాళ్లను అలానే చంపాలి. పోలీసులు నా కొడుకును చంపిని వారికి శిక్ష పడేలా చూడాలి.
– జయరాములు, తేజేశ్వర్ తండ్రి, గద్వాల
నిశ్చితార్థం అయిన తర్వాత ఫిబ్రవరిలో పెండ్లి పెట్టుకున్నాం. పెండ్లికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య ఎవరి వెంటో వెళ్లింది. ఈ విషయం తెలిసి మేము పెండ్లి రద్దు చేసుకున్నాం. అయితే ఐశ్వర్య మా బిడ్డకు మాయమాటలు చెప్పి వలలో వేసుకుంది. పెళ్లి మాకు ఇష్టం లేదు. పెళ్లి వద్దని చెప్పాం అయినా మా మాట వినకుండా ఆ మాయలాడి మాటలు విని పెళ్లి చేసుకున్నాడు. మా బిడ్డ మా మాట విని ఉంటే ఇలా జరిగేదు కాదేమో.. మా బిడ్డ మా మాట వినుంటే బతికేవాడేమో.. ఇప్పుడు అనంతలోకాలకు వెళ్లి మాకు కడుపుకోత మిగిల్చాడు..
– శకుంతల, తేజేశ్వర్ తల్లి, గద్వాల
అభం శుభం తెలియని మా తమ్ముడిని ఐశ్వర్య మాయమాటలు చెప్పి పెండ్లి చేసుకుంది. మా తమ్ముడితో సంసారం చేయడం ఇష్టం లేకపోతే వెళ్లి పోవాల్సింది. మా తమ్ముడిని చంపాల్సిన అవసరం ఏముంది? మా అమ్మ, నాన్న వృద్ధ దంపతులు వారిని తేజేశ్వర్ బాగా చూసుకునే వాడు. ఇప్పుడు వాడిని పొట్టన పెట్టుకున్నారు. మా అమ్మనాన్న ఆలనా,పాలన ఎవరు చూస్తారు. ఇటువంటి అఘాత్యాలకు పాల్పడిన ఐశ్వర్యతోపాటు మా తమ్ముడి హత్యలో పాల్గొన్న వారందరినీ ఉరితీయాలి అప్పుడే మా కుటుంబానికి మనశ్శాంతి. ఏ ఆడపిల్ల ఇటువంటి అఘాత్యాలకు ఒడి గట్టకూడదు.
– రమాదేవి, తేజేశ్వరి సోదరి, గద్వాల