గద్వాల అర్బన్, జూన్ 22 : జిల్లా కేంద్రంలోని రాజావీధికి కాలనీకి చెందిన తేజేశ్వర్(32) జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి మే 18వ తేదీన పెండ్లి చేసుకున్నాడు. పెండ్ల్లికి ముందు సదరు యువతితో ప్రేమలో ఉన్నప్పుడే మనస్పర్థలు రావడంతో కొన్నిరోజులు ఇద్దరు దూరంగా ఉన్నారు. కొన్నిరోజుల తర్వాత మనస్పర్థలు తొలగిపోవడంతో వీరు పెండ్ల్లి చేసుకున్నారు. పెండ్లి తర్వాత యువతి వ్యవహరశైలిలో మార్పు రావడంతో ఇద్దరి మధ్య మళ్లీ మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు సమాచారం. యువతితోపాటు ఆమె తల్లికి కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ బ్యాంక్ మేనేజర్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పెండ్లి అయిన నెల రోజుల్లో మళ్లీ తేజేశ్వర్‌ను కాదని సదరు యువతి బ్యాంక్ మేనేజర్‌తో చనువుగా ఉన్నట్లు తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీరి వ్యవహారానికి తేజేశ్వర్ అడ్డువస్తున్నాడని గ్రహించిన అతని భార్య, అత్త, బ్యాంక్ మేనేజర్ హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో తేజేశ్వర్‌ను ఈనెల 17వ తేదీన కొందరు వ్యక్తులు భూమి సర్వే చేయాలని కా రులో ఎక్కించుకొని వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సాయంత్రం అయిన తేజేశ్వర్ ఇంటికి రాకపోవడంతో కుటుం బ సభ్యులు ఆందోళన చెంది జిల్లాకేంద్రంలో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక బృందంతో ఆరా తీయగా శనివారం ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలోని కర్నూల్ జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు సమీపంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు తేజశ్వర్ మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తేజేశ్వర్‌ను భార్య, అత్త, బ్యాంక్ మేనేజర్ పథకం ప్రకారం హత్య చేశారని కు టుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై గద్వాల సీఐ టంగుటూరి శ్రీనును వివరణ కోరగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నామన్నారు. తేజేశ్వర్ మొబైల్‌తోపాటు భా ర్య, అత్త అందరి ఫోన్లను ట్రేస్ చేసినట్లు తెలిపారు. త్వరలో ఈ కేసును ఛేదించి వివరాలను వెల్లడిస్తామన్నారు.