గద్వాల, జూన్ 13 : జూన్ రాగానే చాలా కుటుంబాల నెలవారీ బడ్జెట్ గాడి తప్పుతోంది. ఈ మాసం పెట్టుబడులకు కేరాఫ్‌గా మారింది. ఇప్పుడే పాఠశాలలు పునఃప్రారంభం కానుండడం.. విద్యాభ్యాసానికి ఖర్చులు పెరగడం.. మరోవైపు రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో వ్యవసాయ పనులకు రైతులు సిద్ధమవ్వడం.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లుకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులపై.. అటు పంటల సాగుకు పెట్టుబడి పెట్టే రైతు కుటుంబంపై భారం పడుతున్నది. బయట అప్పులు తెచ్చి మరి తమ పిల్లలను చదువుకు.. అధికంగా పంట దిగుబడులు సాధించాలని అన్నదాతలు.. ఇలా సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో అప్పుల తిప్పలు మొదలయ్యేది ఈనెల నుంచే..
వేసవి సెలవులు 45 రోజుల పాటు వి రామం తీసుకుంటూ వి శ్రాంతి గా గ డిపిన ప్రజలు, రైతులను ఈ నెల ఒక్కసారి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జూన్ నెల ప్రారంభం కాగానే ఖర్చుల మోతతో సగటు మనిషి జేబు ఖాళీగా దర్శనమిస్తుంటది. ప్రస్తుతం విద్య పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారమవుతుంది. పాఠశాలలు ప్రారంభం కాగానే పిల్లల ఫీజుల కోసం అప్పులు చేయక తప్పటం లేదు. పిల్లల చదువులు, పాఠశాల ఫీజులు, పుస్తకాలు, డ్రస్‌లు ఇలా అన్ని కొనుగోలు చేయాల్సి రావడంతో సగటు సామాన్య జీవికి అన్ని రకాల ఖర్చులు ఎదురవుతున్నాయి.
జీతం కొంచెం.. ఖర్చులు బారెడు కావడంతో విధి లేని పరిస్థితిలో ఖర్చు రెట్టింపు అయినా అప్పు చేసి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కొత్తగా పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలను చేర్చేవారికి పుస్తకాలు, ఫీజులు, హాస్టల్ ఫీజులంటూ ఇబ్బందులు ఇలా సగటు జీవిని వెంటాడుతుంటాయి ఈ నెల గడిస్తే మొత్తం గండం గడిచినట్లే భావిస్తారు. రెక్కల కష్టం చేసి తమ పిల్లలకు, బంగారు భవిష్యత్ అందించడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు పిల్లల చదువులు, మరోవైపు ఇంటిని నడిపేదెలా అంటూ ఇంటి పెద్దలు, మహిళలు ఆలోచిస్తున్నారు.
జూన్ మొదటివారంలో అడపా దడపా వర్షాలు కురువడంతో రైతులు సాగు పనులు మొదలు పెడుతున్నారు. తమ పొలాలను చదును చేస్తూ విత్తనాలు విత్తడానికి సిద్ధం చేస్తున్నారు. పిల్లలను చదువులకు పంపుతూనే వ్యవసాయం వైపు సగటు జీవి మరలుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పనిచేసి పంట పండిస్తేనే పిల్లల చదువులతో పాటు, కుటుంబ పోషణ ఎటువంటి ఒడిదుడుకు లు లేకుండా సాగుతుందని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నా డు. జూన్‌లో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతన్నకు ఈ నెలలో కష్టమనే బీజం మొలుస్తుంది. విత్తనాలు, ఎరు
వుల కొనుగోలు, సా గు కోసం డబ్బులు ఖర్చులు చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుత పరిస్థితిలో సాగు వ్యయం పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడుల కోసం సకాలంలో డబ్బులు చేతికి రాకపోవడం, ముంచుకొస్తున్న అదను ఇలా ఒకటి తర్వాత ఒక సమస్య ఇదే నెలలో రైతులను వెంటాడుతుంటే వారికి ఏమి చేయాలో తోచడం లేదు. గత ప్రభుత్వంలో రైతులు పొలాల్లో విత్తులు నాటే నాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు వేయడంతో ఆసాముల వద్దకు రైతులు అప్పులు చేయకుండా పెట్టుబడి సాయానికి వాడుకోవడంతో పాటు, కొంత పిల్లల చదువుకు వాడుకునే వారు దీంతో జూన్మాసంలో సగటు జీవికి ఎ లాంటి ఇబ్బందులు ఉండేవి కావు.
ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా వేస్తుండండతో అది కూడ అరకొర వేస్తుండండతో రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీనికి తోడు వానకాల సీజన్ ప్రారంభం కావడంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇది సగటు జీవికి అదనపు ఖర్చు కావడంతో జూన్ మాసం అంత ఖర్చుల జంజాటంతోనే మానవుడు కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొన్నది.అందుకే అన్ని వర్గాల ప్రజలు జూన్ మాసం మొదలైయిందంటే వామ్మో జూన్ మాసం అని భయపడుతున్నారు.
జూన్ మాసంలో రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఖర్చుల జంజాటం వెంటాడుతున్నది. జూన్ నెల వచ్చిందంటే పెరిగిన ఖర్చులతో అన్ని వర్గాల ప్రజలు బెంబేలెత్తుతుంటారు. దీంతో ఈనెల వచ్చిందంటే ప్రజలు వామ్మో జూన్ అంటున్నారు. ఒకరికి విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులను చూస్తే భయం, రైతులకు పెరిగిన వ్యవసాయ ఖర్చులు చూస్తే భయం ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయం వెంటాడుతుంది. కానీ సగటు జీవికి మాత్రం జూన్ మాసం వచ్చిందంటే గుండెల్లో గుబులు పుడుతోంది. అరకొర సంపాదన ఉన్నవారైతే అధిక ఖర్చుల జంజాటంలో కొట్టుమిట్టాడుతున్నారు.
సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు జూన్ నెల వచ్చిందంటే పెద్ద ఆపదే…ఈ ఆపద నుంచి గట్టెక్కడానికి ఆసాముల వద్ద అప్పు చేయడంతోపాటు ఇతర మార్గాలు సగటు జీవి అన్వేషిస్తుంటాడు. ఏడాది మ్తొతం ఎదుర్కొనే ఆర్థిక భారం ఒక ఎత్తు అయితే జూన్ నెలలో మోసే ఆర్థిక భారం మరో ఎత్తు. ఈ నెలలో సగటు జీవికి పిల్లల ఫీజులతో పాటు వ్యవసాయ ఖర్చుల అన్ని ఒకేసారి నెత్తిన పడడంతో మధ్యతరగతి సగటు జీవికి ఏమి చేయాలో అర్థం కావడం లేదు. జూన్ నెల వచ్చిందంటే వామ్మో జూన్ అనే పరిస్థితి అన్ని వర్గాల్లో నెలకొన్నది.