శ్రీశైలం, డిసెంబర్ 26 : శ్రీశైల క్షేత్రంలో రా ష్ట్రపతి ద్రౌపదిముర్ము సందడి చేశారు. సోమవారం ఆలయాన్ని రాష్ట్రపతి తన కూతురుతో క లిసి దర్శించుకొని భ్రమరాంబ, మల్లికార్జున స్వా మి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అం తకుముందు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, తెలంగా ణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్లకు ఆలయ ప్రధాన గోపురం వద్ద ఏపీ దేవాదాయ శాఖ మం త్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, రా ష్ట్ర ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, కలెక్టర్ మ నజీర్ జిలానీ, ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఘన స్వాగ తం పలికారు. శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్ద దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ ప్ర వేశం చేయించి ఉభయ ఆలయాల్లో పూజలు చే యించారు.
పరివార దేవతలను దర్శించుకున్న రాష్ట్రపతి, గవర్నర్‌కు తీర్థప్రసాదాలు, స్వామి వా రి శేషవస్ర్తాలు, పరిమళ విభూది, జ్ఞాపికను అందజేశారు. అనంతరం రూ.43.08 కోట్లతో ప్రసాద్ స్కీం కింద చేపట్టిన పలు శిలాఫలకాలను రాష్ట్రపతి ప్రారంభించారు. హఠకేశ్వరం, శిఖరేశ్వంలలో ఎమినిటీ సెంటర్, పుష్కరిణి, ప్ర ధానాలయంలో విద్యుద్దీకరణ, కృష్టవేణిరోడ్, యాంపీ థియేటర్, ఇల్యూమినేషన్ అండ్ సౌం డ్ లైటింగ్ షో, డిజిటర్ ఇంటర్వెన్షన్ పార్కింగ్ ఏరియా, టాయిలెట్ కాంప్లెక్స్‌లు, సావనీర్ షాపులు, ఫుడ్కోర్ట్, ఏటీఎం అండ్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రానికి రాష్ట్రపతి చేరుకోగా, స్ఫూర్తికేంద్రం అధ్యక్షుడు వెంకటేశ్ ఆధ్వర్యంలో గిరిజన చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో ఆ హ్వానం పలికారు. స్ఫూర్తి కేంద్రంలోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న సం క్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. కార్యక్రమంలో టూరిజంశాఖ కార్యదర్శి అరవింద్‌సింగ్, ఏపీ టూరిజం ఎండీ అండ్ సీఈవో కన్నబాబు, చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి ఉన్నారు.
కష్టాలను జయిస్తేనే విజయం..
‘జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ విద్యాభ్యాసం చేశాను. మా నాన్న కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. అడుగడుగునా ఎదురవుతున్న కష్టాలను జయించడంవల్లే ఈ స్థాయికి చేరుకోగలిగాను’ అని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తెలిపారు. స్ఫూర్తి కేంద్రంలో పది నిమిషాలపాటు గిరిజన మహిళలు, చిన్నారులతో మాట్లాడారు. భావిభారత పౌరులుగా ఎదిగేందుకు ప్రతి చిన్నారి విద్యార్థి దశ నుంచే దేశభక్తి అలవర్చుకోవాలన్నారు. తిరుగు ప్రయాణంలో నంది సర్కిల్ వద్ద కాన్వాయ్ నుంచి దిగి అభిమానులను పలకరించారు.