భూత్పూర్, మే 16 : ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం అన్నాసాగర్‌లోని తన నివాసంలో కౌకుంట్ల మం డల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయా న్ని కార్యకర్తలకు ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి బీఆర్ఎస్ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. పదేండ్లు సంబురంగా సాగిన వ్యవసాయం ఏడాదిలోనే తలకిందులయ్యిందన్నారు. సమయానికి సాగునీళ్లు లేక, అరకొరగా వచ్చిన పంటలను అమ్ముకుందామంటే కూడా అష్టకష్టాలు పెట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులను పెట్టి బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదన్నారు. కౌకుంట్ల మండలంలో పార్టీ బ లంగా ఉన్నదని, మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూ చించారు. యువకులు సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ప్రజల పక్షాన నిలబడాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చందుగౌడ్, మాజీ ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, నాయకు లు రఘు, కిష్టన్న, శేఖర్‌రెడ్డి, రవి, కృష్ణయ్య పాల్గొన్నారు.