మహబూబ్ నగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా జర్నలిస్టులను ముందస్తు అరెస్టు చేశారు.ఇందులో భాగంగా టీడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్ ను భూత్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జిల్లా కేంద్రంలో పలువురు జర్నలిస్టులను అరెస్టు చేయడం పట్ల యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు.