వెల్దండ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో గిరిజన మహిళకు అవకాశం ఇవ్వాలంటూ
లంబాడ హక్కుల పోరాట సమితి, రాష్ట్ర గిరిజన విద్యార్థి సమితి ఆధ్వర్యంలో చలో గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ముట్టడికి వెళ్లకుండా స్థానిక గిరిజన నాయకులను వెల్దండ పోలీసులు (Veldanda Police ) ముందస్తు అరెస్టు (Pre-arrest ) చేశారు.
ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సమితి మండల ఉపాధ్యక్షులు రఘుపతి నాయక్ మాట్లాడారు. అన్ని రంగాల్లో గిరిజనులు ( Tribals ) వివక్షతకు గురవుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన మహిళకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.