పాలమూరు, ఏప్రిల్ 30 : మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థి కె.పవన్‌కుమార్ జేఈఈలో 99.10 పర్సంటైల్‌తో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల బృందం అభినందించారు. ఎండీ ఇబ్రహీం 99.86 పర్సంటేజ్‌తో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1,677వ ర్యాంక్, కె.సూర్యతేజ 578ర్యాంక్, వి.కార్తీక్ 2,399వ ర్యాంక్, ఎం.శివతేజ 2,737వ ర్యాంక్ సాధించడం జిల్లాకే గర్వకారణం.
అదేవిధంగా ఎం.శివతేజ 98.98, పి.తనుశ్రీ 98.89, యు.నిఖిలేష్కుమార్ 98.16, సాయిసాకేత్రెడ్డి 97.07, కె.పూజిత 96.32, యశ్వంత్‌చారి 96.13, ఎండీ అజర్హుస్సేన్ 95.51, సుప్రిత 95.44, జి.సాత్విక్‌రెడ్డి 94.88, యు.శృతి 94.70, వరుణ్‌కుమార్‌రెడ్డి 94.50, ఇ.స్పందన 94.29, సి.రిషిత 93.96, షాహెద్ అజీం 93.90, ఎస్.బాబారెడ్డి 93.10, సాయిచరణ్ 92.80, అనిరుధ్గౌడ్ 92.69, ఈశ్వర్ 92.65, ఎం.నందిని 92.09 పర్సంటైల్ సాధించి జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచారు. 41మంది విద్యార్థులు 90 పర్సంటైల్ పైగా ఫలితాలు సాధించారు. కాగా 185మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు మంజులాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు కృష్ణయ్య, వెంకటరామయ్య, వెంకట్‌రెడ్డి, అధ్యాపక బృందం అభినందించారు.