నాగర్ కర్నూల్ : ఉమ్మడి మహబూబ్ నగర్ ( Mahabubnagar ) జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) రెండు రోజుల పర్యటన సందర్భంగా ఉద్రిక్త ( Tension ) పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ముందస్తు అరెస్టు చేస్తూ గృహ నిర్బంధం చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం సీఎం పర్యటన రెండో రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు హల్చల్ చేశారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు గ్రామ పరిధిలో ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఆ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామ ప్రథమ పౌరుడిగా సమీక్షలో పాల్గొనే హక్కు ఉన్నప్పటికీ పోలీసులు నిర్బంధించడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది. రేవంత్ రెడ్డి భూత్పూర్ మండలం కరివెన్ రిజర్వాయర్ సందర్శన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ సర్పంచులను, మాజీ సర్పంచ్ లను అరెస్ట్ చేసి భూత్పూర్ పీఎస్‌కు తరలించారు.