రాష్ట్రంలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని బీ ఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాపాడా లని మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని పీజీ కళాశాలలో, వనపర్తిలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో, మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు పలు చోట్ల ప్రభుత్వ దిష్టిబొమ్మను ద హనం చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్ వర్సిటీలో బుల్డోజర్లు పెట్టి మూగజీవాల ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. వారం రోజులుగా వర్సిటీ భూములు వేలం వేయొద్దని వి ద్యార్థులు ఉద్యమాలు, ఆందోళనలు చేస్తుండగా, అక్రమంగా లాఠిఛార్జీలు, అరెస్టులు చేయిస్తోందని ఆరోపించారు. అదేవిధంగా హెచ్‌సీయూలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు తరలివెళ్తున్న ఉ మ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.