No stock పెట్రో.. తంట
యుద్ధం కారణంగా వంట గ్యాస్‌తోపాటు, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో బుధవారం నాగర్‌కర్నూల్, పాలమూరుతో పాటు పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల ముందు వాహనదారులు బారులుతీరి కనిపించారు.
- ఉమ్మడి జిల్లాలో ఫ్యూయల్ టెన్షన్
- పెట్రోల బంక్‌ల వద్ద వాహనదారుల బారులు
- పలు ఫిల్లింగ్ స్టేషన్లలో నోస్టాక్ బోర్డులు
నాగర్‌కర్నూల్, మార్చి 25 : యుద్ధం కారణంగా వంట గ్యాస్‌తోపాటు, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో బుధవారం నాగర్‌కర్నూల్, పాలమూరుతో పాటు పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల ముందు వాహనదారులు బారులుతీరి కనిపించారు.
నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తెలకపల్లి మండలాల్లోని చాలా బంకుల ముందు డీజిల్, పెట్రోల్ లేకపోవడంతో నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో పలు వాహనదారులు జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. వివిధ ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ముందస్తుగానే క్యాన్లు, బ్యారళ్లతో వచ్చి క్కూలైన్లో గంటల తరబడి నిలబడి పెట్రోల్, డీజిల్‌ను తీసుకెళ్తున్నా రు.
ఉదయం నుంచి ఏకతాటిగా ఇంధ నం కోసం బారులు తీరి డీజిల్, పెట్రోల్ కొట్టించుకోవడంతో చా లా బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టారు. ఓవైపు డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదని పే ర్కొంటున్నా అవేవీ పట్టించుకోని వాహనదారులు డ్రమ్ములు, క్యాన్లల్లో పెట్రోల్, డీజిల్ తీసుకెళుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

