పెబ్బేరు, ఆగస్టు 31 : ఎడతెరిపి లేని వర్షాల కు ఇల్లు కూలి వ్యక్తి దు ర్మరణం చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. శ్రీరంగాపు రం మండలం తాటిపాముల గ్రామంలో శుక్రవారం రాత్రి వడ్డె చంద్ర య్య (65) తన ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి పై కప్పు కూలిపోయింది. చుట్టుపక్కల వారు వెంటనే సహాయ చర్యలు చేపట్టి ఆయనను వె లికితీయగా అప్పటికే మృతి చెందాడు.
మృ తుడి భార్య గతంలోనే మృతి చెందగా ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాడు. ఆయన ఇద్దరి కొ డుకులు కూడా గ్రామంలోనే వేర్వేరుగా నివసిస్తున్నారు. ఘటన తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకొని పంచనా మా నిర్వహించారు. శనివారం వనపర్తి ఏరి యా దవాఖానలో ఉన్న చంద్రయ్య మృతదేహాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.