ఊట్కూర్ : తెలంగాణలో అమలవుతున్న భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ( Maktal MLA Vakiti Srihari ) , నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ (Collector Siktha Patnaik ) అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టం ( Land Revenue Act) అమలుపై తహసీల్దార్ చింత రవి అధ్యక్షతన అవగాహన సదస్సు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వారు మాట్లాడుతూ వచ్చే నెలలో రెవెన్యూ అధికారులు అన్ని గ్రామాలలో పర్యటించి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు. భూభారతి చట్టంలో భాగంగా సాదా బైనామా ప్రక్రియను మళ్లీ అమలులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు నిర్దిష్ట గడువు విధించామని తెలిపారు. రాబోయే కాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కు ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ తప్పనిసరి ఉంటుందన్నారు.
ప్రభుత్వం రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రాత్మకమైన మార్పును తీసుకువచ్చారని కొనియాడారు. తెలంగాణ సాంస్కృతిక కళాజాత మండలి బృందం సభ్యులు మాట, పాటలతో భూభారతి చట్టం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ మొట్కార్ బాల్ రెడ్డి, ఏవో గణేష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు సూర్య ప్రకాష్ రెడ్డి, మణెమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విగ్నేశ్వర్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.