నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : వంచన, మోసం, దగాకు కాంగ్రెస్ మారుపేరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గత అ సెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి ప్రజలను వంచించిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులను మరే పార్టీ ఇంతగా మోసగించలేదన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చే శారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పార్లమెంట్ ఎన్నికల అధికారి ఉదయ్‌కుమార్‌కు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గు వ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్‌తో కలిసి ఆర్ఎస్పీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భం గా మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి సింగిరెడ్డి మాట్లాడారు. బీజేపీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, రైతుల ఆ దాయం రెట్టింపు ఏమైందన్నారు. ధరలు ఆకాశాన్ని అం టుతున్నాయని, ప్రధాని మోదీ ఏ రంగంలో అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తెల్లారగానే ఉద్యోగం వస్తుందన్న భ్రమ కల్పించి విపరీతమైన ద్వేషం, వ్యతిరేకతను పెంచారన్నారు. అమ్మాయిలకు స్కూటీలు, ని రుద్యోగ భృతి ఇస్తామని, గ్యారెంటీ లేకుం డా రూ.5 లక్ష లు.. ఇలా ఎన్నో చెప్పి అధికారం చేపట్టి ఐదు నెలలవుతున్నా మెగా డీఎస్సీ ఊసే లేదన్నారు. రైతుబంధు రూ.15వేలు ఇస్తామని నోట్లో నీళ్లు ఊరించారని, రూ.500 బోనస్‌తో వడ్లు కొంటామని చెప్పారని.. ఇ ప్పుడేమో యా సంగి వడ్లు కొనే నాథుడే లేరన్నారు. ధాన్యం కొనుగోళ్లకు రైతు లు ఎక్కడికక్కడ పడిగాపులు కాస్తున్నారన్నారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రపంచపటంలో నిలిపేలా పనిచేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నిస్వార్థం, అకుంఠిత దీక్ష తో పార్లమెంట్లో ప్రజల గొంతుక వినిపిస్తానన్నారు. ప్రజల నుం చి తనకు విశేష స్పందన వస్తున్నదని, ఒక్క పిలుపుతో 25వేల మంది నామినేషన్‌కు రూ.25వేల చందా ఇచ్చి మద్దతు ప్రకటించారన్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌ప్రసాద్ కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉండి గ్రామాల్లో తిరగకపోతే కనిపించడం లేదంటూ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఎంపీ రాము లు 260రోజులు పార్లమెంట్ నడిస్తే కే వలం 6నిమిషాలు మాత్రమే మా ట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఇంట్లో డాక్టర్లున్నా పేదలకు సేవ చేసింది లేదని, హా య్.. బాయ్ అని పలకరింపులు తప్పా.. అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. విద్యావంతులు, యువత, మేధావులు, ప్రజలంతా త నకు మద్దతిచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి అభిలాష్‌రావు, నాగం శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్, ఏప్రిల్ 19 : కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం తప్పదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. ప్రచారంలో భా గంగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆ పార్టీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జి రంగినేని అభిలాష్‌రావు, పార్టీ శ్రేణులతో కలిసి కొల్లాపూర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ప్రవీణ్‌కుమార్ అభ్యర్థించారు. కాంగ్రెస్ నాయకులు మళ్లీ మాయమాటలతో మ భ్యపెట్టి లబ్ధి పొందడానికి చూస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేసీఆర్ పాలనలో కష్టా లు ఎరగని ప్రజలు నాలుగు నెలల రేవంత్‌రెడ్డి పాలనలో కరెంట్, తాగు, సాగునీటి గోస అనుభవించారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ అని చెప్పిన సీఎం.. ఇప్పుడు ఓట్ల కోసం ఆగస్టు 15న మాఫీ చేస్తామనడం విడ్డూరమన్నారు. హామీలను తుం గలో తొక్కిన కాంగ్రెస్ నాయకులకు కర్రు కాల్చి వాతపెట్టాలని సూ చించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో కరువు దాపురించి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ప్రభుత్వం స్పందించడంలేదని ఆరోపించారు. స్థానికేతరుడైన మల్లురవి గతంలో ఎంపీ, ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. రాములు ఎంపీగా ఎలాంటి అభివృద్ధి చేయకపోగా తన కొడుకుకు ఎంపీ టికెట్ కోసం బీజేపీలో చేరి, బీఆర్ఎస్కు ద్రోహం చేశారన్నారు. అధికార పార్టీ నాయకు ల బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా సంఘటితంగా పనిచేయాలని కోరారు. రోడ్ షోలో బీఆర్ఎస్ నాయకులు జంబులయ్య, రాంచందర్‌యాదవ్, నిరంజన్, కౌన్సిలర్ కృష్ణ
కల్వకుర్తి, ఏప్రిల్ 19 : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని పేదింటి బిడ్డల భవిషత్ను గొ ప్పగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కల్వకుర్తి సమీపంలో ని కల్వకుర్తి- శ్రీశైలం ప్రధాన రహదారిపై తెలంగాణ బ్లాక్ వాయిస్ వ్యవస్థాపకుడు శ్రీధర్ గోవిం ద్ ఆధ్వర్యంలో నామినేషన్ డిపాజిట్ కోసం ‘ఆర్ఎస్ సపోర్టర్ మీట్’ ద్వారా సేకరించిన విరాళా లు రూ.17,500ను అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌కు శు క్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు తన బాధ్యతను మరింత పెం చాయన్నారు. తనపై అభిమానంతో విరాళం సేకరించడం చాలా గొప్ప విషయమన్నారు. అంతకుముందు ప్రవీణ్‌కుమార్‌కు ఆయన అభిమానులు స్వాగతం పలికి సత్కరించారు.