నారాయణపేట, ఫిబ్రవరి 21 : నారాయణపే ట జిల్లా పర్యటనలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నో హామీలు ఇస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన జనానికి నిరాశే ఎదురైంది. ఒక హామీ కూడా ఇవ్వకుండా.. కేవలం రాజకీయ ప్రసంగం మాత్రమే చేసి వెళ్లడంతో ముఖ్యమంత్రి పర్యటన కాస్తా జై తుస్గా మారిందని సభకు వచ్చిన జనం చర్చించుకోవడం కనిపించింది. ముఖ్యంగా మూ డు మండలాల ప్రకటన వెలువడుతుందని అంద రూ భావించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నారాయణపేట మండలంలోని కోటకొండ, దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి, కోయిలకొండ మండలం గార్లపాడ్ను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నారాయణపేటకు పీసీసీ అధ్యక్షు డి హోదాలో వచ్చిన రేవంత్ స్వయంగా ప్రకటించారు.
అయితే కోటకొండ మండలం కోసం ఇటీవల ఆయా గ్రామాల ప్రజలు, వివిధ పార్టీల నా యకులు ఆందోళన చేపట్టగా, కాంగ్రెస్ జిల్లా నేత జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి నోటి ద్వారా త్వ రలోనే మూడు మండలాల ప్రకటన చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సీఎం పర్యటనలో మూడు మండలాల ప్రకటన ఉంటుందని భావించినా రా కపోవడంతో జనం నిట్టూర్చారు. అంతకు ముం దు సభ వేదిక మీద మాట్లాడిన స్థానిక శాసన స భ్యురాలు పర్ణికారెడ్డి సైతం మూడు మండలాల గురించి మాట్లాడకపోవడం ఆయా మండలాల నాయకులకు, ప్రజలకు విస్మయానికి గురిచేసింది.
ఇతర సమస్యల గురించి ప్రస్తావించినా, తమకు ముఖ్యమంత్రి ద్వారా మండలాల ప్రకటన చేయిస్తామని చెప్పి కూడా ఎందుకు ప్రస్తావించలేదని, ఒక సమయంలో ఎమ్మెల్యే ప్రసంగం ముగిసిన త ర్వాత మండలాల గురించి ప్రస్తావించాలి మేడం అంటూ జనం మధ్యలో నుంచి గట్టిగా ఎవరో అరిచినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో కూడా కొంత మంది ప్లకార్డు లు పట్టుకొని డిమాండ్ చేసినా.. మూడు మండలాల ప్రకటన ముఖ్యమంత్రి పర్యటనలో అడియాశగానే మిగిలిపోయిందని చెప్పొచ్చు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సం గంబండ రిజర్వాయర్ నుంచి నీటి విడుదలలో అంతరాయం కారణంగా ఆందోళన చెందుతున్న మక్తల్ మండల పరిసర గ్రామాలకు చెందిన వరి రైతులు, నీటి విడుదలపై ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశిస్తారని ఆయా రైతులు భావించినా కనీ సం సీఎం ఈ విషయంపై నోరు మెదపలేకపోవ డం గమనార్హం. రిజర్వాయర్ మీద ఆధారపడి పంటలు వేశామని, అకస్మాత్తుగా నీటి విడుదలలో అంతరాయం ఏర్పడడంతో దికుతోచడం లేదని పలువురు కర్షకులు వాపోయారు.
నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే జ నం పెద్ద ఎత్తున బయట కు వెళ్లిపోయారు. దీంతో సభా ప్రాంగణంలోని రెండు, మూడు గ్యాలరీలు ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. అనుమతి పాసు లున్నా సభా వేదిక ప్రాంగణంలోకి జనాన్ని అనుమతించకపోవడంతో పోలీసు జులుం నశించాలి.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంతో అభివృద్ధి చేస్తున్న సీఎంకు లేచి నిలబడి కృతజ్ఞతలు తెలపాలని, ఎ మ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేసినా వా రి నుంచి స్పందన రాలేదు. రుణమాఫీ కింద ని యోజకవర్గంలో రూ.200 కోట్లు మాఫీ అయ్యాయని, మరో రూ.50 కోట్లు మాఫీ కావాల్సి ఉన్నదని, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రస్తావించడం చూస్తుం టే సీఎం, మంత్రుల సాక్షిగా 100 శాతం రుణమా ఫీ కాలేదని ఒప్పుకున్నట్లు అయ్యింది.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయే రైతులకు నారాయణపేట పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి నుంచి ఏదైనా భ రోసా దకుతుందా? అని ఎదురు చూసిన రై తులకు ఎలాంటి భరోసా దకకపోవడంతో తీవ్ర ని రాశతో వెనుతిరిగారు. భరోసా ఇవ్వకపోగా పై నుంచి దా మరగిద్ద తండాకు చెందిన రైతులను సీఎం పర్యటన దృష్ట్యా ముందస్తు అరెస్టు చేయడం కొసమెరుపు. బాబు నాయక్‌తోపాటు పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం వదిలపెట్టారు. ప్రాజెక్టు ఏర్పాటుతో భూములు కోల్పోయే రైతులు, ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు ఇచ్చేది లేద ని, ఏండ్ల తరబడి భూమినే నమ్ముకొని తాము జీవనం కొనసాగిస్తున్నామని తెగేసి చెబుతున్నారు.