ధరూరు, జూన్ 3 : మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మండలకేంద్రంలో మంగళవారం చోటు చేసుకున్నది. సోమవారం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్‌లో యంత్రాలు శుద్ధి చేయడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. మంగళవారం కూడా నీటిని సరఫరా చేయకపోవడంతో ప్రజలు ఖాళీ బిందెలను పట్టుకొని సమీప వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మండల కేంద్రంలో ని బీసీ కాలనీలో కొంత మంది ఏకంగా ఓవర్ హెడ్ ట్యాంక్‌పైకి ఎక్కి బిందెలతో నీళ్లు తెచ్చుకోవడం కనిపించింది. ఏదీ ఏమైనా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా మిషన్ భ గీరథ నీటి సరఫరాను నిలిపివేయడం సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై ధరూర్ పం చాయతీ కార్యదర్శిని వివరణ కోరగా మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ శుద్ధి చేయడం వలన నీటి స రఫరా నిలిచిపోయిందని చెప్పారు.
అయితే ప్ర జలు ఇబ్బంది వుంటే మాకు తెలిపితే వాటర్ ట్యాంక్‌తో నీటిని సరఫరా చేసేవారమని, అలా ట్యాంకులు ఎక్కి ప్రాణాపాయం తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. అదేవిధంగా మండలంలోని కొత్తపాలెంతండాలోనూ మూడు రోజులు గా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విష యమై ఎంపీవోను వివరణ కోరగా తండాలో పైప్‌లైన్ మరమ్మతులకు కావడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని, మరమ్మతులు చేసి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.