కోస్గి, జనవరి 25 : కొడంగల్ ప్రజల ఓట్లతో గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని మరిచిన సీఎం రేవంత్‌రెడ్డిని నియోజకవర్గం నుంచి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన కోస్గి మున్సిపాలిటీకేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల స మావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థు ల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మె ల్యే సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ అంటేనే మోసమని ఇది ప్రజలు గమనించాలని కోరారు. మరోసారి కోస్గి మున్సిపాలిటీపై గులాబీ జెండా ను ఎగురవేస్తే పూర్తిస్థాయి అభివృద్ధి చేసి కోస్గి మున్సిపాలిటీని రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. ప్రభుత్వం మెడలు వంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచాకా అభివృద్ధి కాగితాలలో తప్పా మరెక్కడా కనిపించడం లేదని ఎద్దే వా చేశారు.
పోటీ చేసే ఆశావాహులందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అ నంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు కరపత్రాన్ని విడుదల చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ, మాజీ వైస్ ఎం పీపీ సాయిలు, తొగాపూర్ నరేందర్‌రెడ్డి, వెంకట్ నర్సిములు, హనుమంతు, చెన్నయ్య, జనార్దన్‌రెడ్డి, కోనేరు సాయప్ప, మధు, నిరంజన్‌రెడ్డి, వెంకటేశ్, బెజ్జు నర్సిములు పాల్గొన్నారు.
మద్దూర్, జనవరి 25 : రెండేళ్ల నుంచి గుర్తురాని మద్దూర్ ఇప్పుడే గుర్తొంచ్చిందా రేవంత్‌రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు. మద్దూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని షాగార్డెన్‌లో అదివారం మున్సిపల్ సన్నాహక సమావేశంలో నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే పట్నం పాల్గొని మాట్లాడారు. మద్దూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని గెలిపించుకుని కేటీఆర్, హరీశ్‌రావుకు కానుక పంపాలన్నారు. మద్దూర్ మున్సిపల్ కార్యాలయంపై వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు.
అలాగే రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనకు మద్దూర్ మున్సిపల్ ఎలక్షన్ నుంచే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆభివృద్ధి పనులే మళ్లీ ప్రారంభించారు తప్పా కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఏ పనులు మొద లు పెట్టలేదని గుర్తుచేశారు. మద్దూర్ మున్సిపాలిటీకేంద్రంలో రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి శనివారం రూ.50కోట్ల నిధులతో పనులు ప్రారంభించడానికి వచ్చారని మరి రెండేళ్ల నుంచి ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నందుకు ప్రారంభించారని మద్దూర్ మున్సిపల్ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు కాంగ్రెస్ బాకీ కార్డు ప్రదర్శిస్తూ వారు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంచర్ల గోపాల్, మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ కరాటే రాజు, నాయకులు సలీం, వీరారెడ్డి, శివకుమార్, జగదీశ్వర్, విజయ భాస్కర్‌రెడ్డి, సురేశ్ రావు, నర్సిములు, ఉమ్మడి మద్దూర్ బీఆర్ఎస్ మండ ల నాయకులు, కార్యకర్తలు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.