గద్వాలటౌన్, జూలై 9 : జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానకు ప్రతి రోజూ పదుల సంఖ్యలో రోగులు వస్తున్నారు. అం దులో వృద్ధులు.. నడవలేని స్థితిలో ఉన్న వారు, దివ్యాంగులు ఉంటారు. వీరి కో సం దవాఖానలో వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి. అంతేకాక రోగులను దవాఖాన సిబ్బంది తీసుకెళ్లాలి. కానీ జిల్లా దవాఖానలో అలాంటి నిబంధనలు ఏమీ లేవు. చికిత్స నిమిత్తం గురువారం జిల్లా దవాఖానకు వచ్చిన ఓ వృద్ధురాలిని ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లేందుకు ఆమె బంధువులు వీల్ చైర్ సహాయం కోరారు. ఇందుకు సిబ్బంది వీల్ చైర్లు లేవు.. ఇష్టం ఉంటే మోసుకెళ్లు అన్నట్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీం తో గత్యంతరం లేక వృద్ధురాలి బంధువులు ఆమెను చేతులపై చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.
అంతే కాకుండా దవాఖానలోని వివిధ వార్డులకు పరీక్షల నిమిత్తం వృద్ధురాలిని తీసుకెళ్లడానికి సహాయకులు నానా అవస్థలు పడ్డారు. వారి అవస్థలను చూడలేక అక్కడ ఉన్న వారు సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధా నాలు వచ్చాయి. నడవలేని స్థితిలో ఉన్న వారు వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి పరిస్థితి ఏమిటని రోగులు బంధువులు ప్రశ్నించారు. దవాఖానకు వచ్చిన వారందరికీ సహాయకులు ఉండరు కదా అని నిలదీశారు. కాగా వీల్ చైర్లు ఉన్నా.. వాటిని సమకూర్చేందుకు కొందరు సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారని, కొంత మేరా వారికి ముట్టచెబితేనే తోపుడు బండి తెస్తారని కొందరు రోగులు ఆరోపణలు చేస్తున్నా రు. దవాఖాన అభివృద్ధి కమిటీలో స్వ యంగా కలెక్టర్ చైర్మన్గా, ఎమ్మెల్యే కో చైర్మన్గా ఉన్నా పరిస్థితి ఇలా ఉందం టే.. గ్రామాల్లోని పీహెచ్సీల సంగేతేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.