న్యూఢిల్లీ, ఆగస్టు 13 : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ల కింద విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నది. ఈ నెల 16 లోపు దేశీయ, అంతర్జాతీయ రూట్లలో బుకింగ్ చేసుకున్న విమాన టికెట్ల బేస్ ధరపై మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నదని పేర్కొంది.
ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఈ నెల 16 నుంచి అక్టోబర్ 31 లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని తెలిపింది. కస్టమర్ తన ప్రయాణానికి మూడు రోజుల ముందు ‘ఇండిగో80’ ప్రోమో కోడ్‌తో బుకింగ్ చేసుకోవాల్సి వుంటుందని వెల్లడించింది. ఈ ఆఫర్‌ను కంపెనీ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్, ఎంపిక చేసిన ట్రావెల్ పార్ట్నర్లలో బుకింగ్ చేసుకోవచ్చును.