హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్-2026కు దరఖాస్తులు దాఖలు చేసుకునే గడువును పొడిగించినట్టు వర్సిటీ యాజమాన్యం వెల్లడించింది. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31లోగా ఆన్లైన్లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు.
వ్యవసాయ డిప్లొమా, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకుని బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునే వారు ఈ అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్-2026 రాయాల్సి ఉంటుందని వర్సిటీ వివరించింది. వివరాల కోసం వెబ్సైట్ https//pjtau.edu.inలో చూసుకోవాలని వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య గురువారం ప్రకటనలో తెలిపారు.