అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై..
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం మండలంలోని గొరిట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు క్లస్టర్ ఇన్‌చార్జ్జి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, సర్పంచ్ మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వంద మంది కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
- గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి
- నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
- గులాబీగూటికి చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు
తిమ్మాజిపేట, అక్టోబర్ 19 : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం మండలంలోని గొరిట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు క్లస్టర్ ఇన్‌చార్జ్జి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, సర్పంచ్ మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వంద మంది కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో, నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జోగు ప్రదీప్‌తోపాటు మండల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా తాడూరు మండలంలోని ఐతోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మొత్తం వంద మందికి పైగా కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కుమ్మెరలో బీజేపీకి షాక్
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 19: నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెరలో బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీకి షాకిచ్చారు. గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు పలువురు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి కండువాలు వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గ్రామాలు అభివృద్ది చెందాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో రావాలని ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందని, బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.బీఆర్ఎస్లో చేరిన వారిలో నాయకులు, కార్యకర్తలు, కే ఆనంద్, కే సతీశ్, సీ లక్ష్మణ్, ఎండీ సమీ ర్, ఎండీ హైమద్, డీ అనిల్ , ఎం మల్లేశ్, సీ శ్రీకాంత్, కే అనిల్, ఎస్ సిద్దు, ఎస్, ధర్మారెడ్డి, ఎండీ పరాన్, ఏ రాజు, ఎస్ రాము, కే నిరంజన్, ఎస్ భగవంత్, పీ విజ య్, కే శివకుమార్, ఎం శివకుమార్, ఎండీ సర్దార్, ఎండీ మాసూం, డీ శేఖర్, శ్రీకాంత్, భూపతిచారి, తిరుమలచారి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు
- చెక్‌పోస్టుల వద్ద పట్టుబడిన రూ.13.54 లక్షలు
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 19: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పా టు చేసిన చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయని, బుధవా రం ఉదయం నుంచి గురువారం ఉద యం వరకు మధ్యరాత్రి జరిపిన తనిఖీ ల్లో నగదు, మద్యం పట్టుబడినట్లు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఆరు చెక్ పోస్టు లు, ఒక ఇంటర్ స్టేట్ చెక్‌పోస్టు, 5 ఇంట ర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టుల వద్ద వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. తనిఖీల్లో 17మంది నుం చి క్యాష్ సీజ్ కేసులు చేసి 13,54,770 లక్షలు సీజ్ చేయడం జరిగిందన్నారు. 18 లికర్ కేసులు చేసి 306.34 లిటర్స్ మద్యంను సీజ్ చేశామని, అందులో 53.25 లీటర్ సారా, 253.09 లీటర్ల బీర్లు సీజ్ చేసినట్లు, లికర్ ధర రూ. 1,22, 618 ఉంటుందన్నారు. 15 కేసు లు నమోదు చేసి 40మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

