నాగర్ కర్నూలు : ప్రజాపాలన( Praja Palana ) కార్యక్రమానికి వెళ్తూ పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary ) దుర్మరణం చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో చోటు చేసుకుంది. రామాపురం పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) మృతి చెందారు.
స్వగ్రామం యనమన్బెట్ల నుంచి నాగర్ కర్నూలుకు బయలుదేరిన కార్యదర్శి కల్వకోలు – చెన్నపురంపల్లి మధ్య ఎదురుగా వచ్చిన హైదరాబాద్ కారును ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంచాయతీ కార్యదర్శిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.