ఉండవెల్లి, అక్టోబర్ 16 : వితంతు పింఛన్ బాధిత మహిళలకు అందించకుండా ఎనిమిది నెలలుగా అధికారులు కాజేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు లో చోటుచేసుకున్నది. బాధితుల కథ నం ప్రకారం.. బొంకూరుకు చెందిన గురుపాదమ్మ భర్త మంగళి వెంకట్రాముడు 2023 డిసెంబర్లో మృతిచెందాడు. నాగేశ్వరమ్మ భర్త బోయ మద్దిలేటి 2023లో మృతిచెందాడు. కిష్టమ్మ భర్త ఎనిమిది నెలల కిందట మృతిచెందాడు.
ఈ ముగ్గురు వితంతువులకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ మంజూరు చే సింది. కాగా, పంచాయతీ కార్యదర్శి, పోస్ట్మాస్టర్తో కుమ్మకై 2024 ఫిబ్రవరి నుంచి పింఛన్ డబ్బులు డ్రా చేసినా లబ్ధిదారులకు ఇవ్వలేదు. పింఛన్ కోసం వితంతువులు ఎన్నిసార్లు అడిగినా రాలేదని చెబుతున్నారు. గురుపాదమ్మ పిం ఛన్ ఫిబ్రవరి నుంచి మే వరకు డ్రా చేసి జూన్ నుంచి ఇప్పటి వరకు బ్లాక్ లిస్ట్‌లో ఉంచారు.
అలాగే నాగేశ్వరమ్మకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు పింఛన్ తీసుకున్నట్లు రికార్డులో ఉన్నా ఇచ్చింది ఒక నెల మాత్రమే. అలాగే కిష్టమ్మకు సంబంధించి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు పింఛన్ డ్రా చేసినట్లు రికార్డులో నమోదైనా ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుకు ఇవ్వలేదు. ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ కాజేసిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చే యాలని కోరుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి పింఛన్ కాజేసిన పం చాయతీ కార్యదర్శిపై, పోస్ట్మాస్టర్పై చ ర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.