అయిజ, డిసెంబర్ 9 : పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. నిత్యం వీధులను పరిశుభ్రం చేయాల్సిన పారిశుధ్య సిబ్బంది, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో పల్లెలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా చె త్తను డంపింగ్ యార్డులకు తరలించాలంటే డీజిల్ అవసరం. కానీ డీజిల్ లేకపోవడంతో ట్రాక్టర్లను నిలిపివేయడంతో ఎ క్కడి ట్రాక్టర్లు అక్కడే ఉన్నాయి. దీంతో చెత్తలో పందుల సం చరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
మండలంలోని మేడికొండ గ్రామంలో వీధులు అపరిశుభ్రంగా మా రాయి. పారిశుధ్య కార్మికులు పారిశుధ్య పనులు చేపట్టినా చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ కష్టతరమవుతుందని పంచాయతీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే లక్షలు చేతి నుంచి ఖర్చు పెట్టుకున్నా ప్రభుత్వం నిధులను జమ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి దివాకర్‌రెడ్డిని వివరణ కోరగా పంచాయతీలో నిధులు లేకపోవడంతో చెత్త తరలింపును నిలిపివేసిన మాట వాస్తవమే అని అన్నారు. వీధు ల్లో పారిశుధ్య పనులు నిరంతరం చేపడుతున్నామన్నారు. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు చర్య లు తీసుకుంటామని తెలిపారు.