బిజినేపల్లి, అక్టోబర్ 27 : మండలంలోని గుడ్లనర్వలో పల్లెప్రకృతి వనంలో ఉన్న చెట్ల ను ఎలాంటి తీర్మానాలు లేకుండా నరికివేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీ ఆర్ఎస్ హయాంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను నాటారు. ప్రస్తుత కాంగ్రె స్ ప్రభుత్వం ఈ మొక్కలు ఆరోగ్యానికి హాని చేస్తాయన్న సాకుతో ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా చెట్లను నరికి వేస్తున్నారు.
ఫారెస్ట్ అధికారుల అనుమతి లేకుండానే నరికిన చెట్లను విక్రయించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో ఖతలప్పను వివరణ కోరగా, పోనోకార్పాస్ చెట్లు ఉండడం వల్ల శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయన్న ఉద్దేశంతో ప్రభుత్వమే తొలగించాలని చెప్పడం జరిగిందని, వాటి స్థానాల్లో పండ్లు, పూలమొక్కలు నాటాలని ఆదేశాలున్నట్లు తెలిపారు.