పర్యాటక హబ్‌గా పాలమూరు
రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా పాలమూరును తీర్చిదిద్దాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్
- మినీ ట్యాంక్‌బండ్ వద్ద పాత ఏయిర్ క్రాప్ట్ ఏర్పాటు
- ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా పాలమూరును తీర్చిదిద్దాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(ఎన్ఐటీహెచ్ఎం) కార్యాలయంలో మంత్రి మినీ ట్యాంక్‌బండ్, శిల్పారామం పనులపై సమీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌బండ్, శిల్పారామం, నెక్లెస్‌రోడ్, ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
ట్యాంక్‌బండ్ విస్తీర్ణం పెంచడంతో పాటు వాకింగ్‌ట్రాక్, బీచ్ స్పోర్ట్, లైటింగ్, ఎమినిటీస్ ఏర్పాటు చేస్తున్నామని, అందుకు తగినట్లుగా పనులు చేపట్టాలన్నారు. ఐలాండ్ వరకు నిర్మించే సస్పెన్షన్ బ్రిడ్జి ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలన్నారు. ఐలాండ్‌లో మ్యూజికల్ నైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. విమానయానశాఖ నుంచి పాత ఏయిర్క్రాప్ట్ను తీసుకొచ్చి ఐలాండ్‌లో ఉంచాలని, దీనిపై పర్యాటకులు ఎక్కి ట్యాంక్‌బండ్ కనపడేలా ఏర్పాటు చేయాలన్నారు. విమానం చుట్టూ ఫుట్‌పాత్, పక్కనే ఫిరంగులు, మిసైళ్లు ఉంచి ప్రత్యేక అనుభూతి కల్పిస్తామన్నారు. ఐలాండ్ మధ్యలో ఓ రెస్టారెంట్, సెల్ఫీపాయింట్ ఏర్పాటు చేసేలా డిజైన్ చేయాలన్నారు. శిలాతోరణం, చార్మినార్ తరహా ఆర్చీలు సిద్ధం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. సమావేశంలో పర్యాటకశాఖ ఎండీ మనోహర్, సంయుక్త కార్యదర్శి రమేశ్, నిథిమ్ డైరెక్టర్ డాక్టర్ చిన్నంరెడ్డి, అధికారులు అంజిరెడ్డి, ఓంప్రకాశ్, మహేశ్, రాజేశ్, టూరిజం కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

