మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 8: పాలమూరు జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ నేషనల్ ఫంక్షన్హాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్, ప్రమాణస్వీకారం కార్యక్రమాని కి మంత్రి హాజరై మాట్లాడారు.
అంతకుముందు మం త్రి క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు వలసల జిల్లాగా ఉండేదని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వలసలు తగ్గాయని, అందుకు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధే కారణమన్నారు. జిల్లాకేంద్రంలో మినీ ట్యాంక్‌బండ్, శిల్పారామం పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. బైపాస్ రోడ్డు వేశామని, దివిటిపల్లిలో ఐటీ ఇండస్ట్రీయల్ పార్క్, అమరరాజా బ్యాటరీ పరిశ్రమల వల్ల ఉద్యోగ అవకాశలు లభిస్తాయన్నారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా న్యాయపరంగా వ్యవహరించి లేఅవుట్ ప్లాట్లనే అమ్మాలని రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘాలను మంత్రి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డి, రియల్ఎస్టేట్ వ్యాపార సంఘం అధ్యక్షుడు చందుయాదవ్, ప్రధానకార్యదర్శి సురేందర్‌గౌడ్, పురుశోత్తంగౌడ్, హైదర్, వెంకటేశ్వరాచారి, హరిగౌడ్, జగన్నాయక్, రహీమ్, వెంకట్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.