మహబూబ్‌నగర్, జులై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : త్వరలో పాలమూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. కార్పొరేషన్ మాదంటే మాదనె ధీ మాలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రం కావడం.. సీఎం సొంత జిల్లా కావడంతో పాలమూరు కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తాజా గా రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికార యంత్రాంగం ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే విమర్శలు ప్రతివిమర్శలతో వేడెక్కిoది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక సవాలుగా మారింది. మరోవైపు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణతో కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. తాజాగా కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తే జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో అన్ని డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేస్తామ ని కార్యకర్తలు ధీమాగా ఉన్నారు. మరోవైపు అధికా రం మారడంతో చాలామంది మాజీ కౌన్సిలర్లు కాం గ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయా డివిజన్లో స్థా నిక కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్య క్తమవుతున్నది. పార్టీ మారిన వ్యక్తులకు టికెట్లు ఇస్తే ఓడగొడతామని ఆ పార్టీ నాయకులే తెగేసి చెబుతున్నారు. దీంతో పార్టీ మారిన వారంతా తమకు టికె ట్లు దక్కుతాయా లేదా అనే సంశయంలో ఉన్నారు. ఇక బీజేపీలో మాత్రం నాయకులంతా వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొన్నది.
పాలమూరు కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటినుంచే సంసిద్ధమవుతున్నది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ సన్నాక సమావేశం ఊహించని స్థాయిలో విజయవంతమైంది. వచ్చిన కార్యకర్తలం తా ఆయా డివిజన్లో గెలుపు తమదేనని.. పార్టీని నమ్ముకున్న వాళ్లను గుర్తించాలన్నారు. డివిజన్లో కూర్పు ఎలా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని.. పట్టణ ప్రజలు నిరాశలో ఉన్నారని దీన్ని తమకు అనుకూలంగా మల్చుకోవచ్చని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా గతంలో చేసిన తప్పిదాలను గుర్తించి ఈ సారి కష్టపడి పనిచేసే కార్యకర్తలను మాత్రమే ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు విఫలం కావడంతో ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. త్వరలో కార్పొరేషన్ స్థాయిలో అన్ని రకాల పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్నందున 60కి 60 డివిజన్లు గెలిచి తొలి కార్పొరేషన్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని తీర్మానించారు.
జిల్లా కేంద్రంలో ఏ వన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 49 వార్డులు ఉండేవి. ఇందులో ఏకంగా బీఆర్ఎస్ 39 వార్డులను గెలుచుకొని తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. కాంగ్రెస్ 2019లో జరిగిన ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కా యి. 2023 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మారడంతో ఏకంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు 30 మంది కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కాంగ్రెస్ మద్దతుతో పార్టీ మారిన వారికి అంటగట్టారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు వస్తే నాలాలు తెగిపోయి లోతట్టు ప్రాంతాలు జలమవుతాయని భావించి మాజీమంత్రి అప్పట్లో పట్టణంలో నాలాల విస్తరణ.. కాలనీలో సీసీ రోడ్లు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటుకు దాదాపు రూ. 100 కోట్లు కావాలని అప్పటి సీఎంను అభ్యర్థించారు. దీంతో రూ.100 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. అధికారం మారడంతో ఇవి ఆగిపోయా యి. తాజాగా ఈ నిధులు రావడంతో జిల్లా కేంద్రం లో జోరుగా సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పను లు నడుస్తున్నాయి.
మరోవైపు పట్టణంలో ప్రధాన రహదారుల్లో కూడా కార్పొరేషన్‌కు తగ్గట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండాలని చెబుతూ రూ.380 కోట్ల ప్రతిపాదలు చేయగా టెండర్లను ఆహ్వానించాల్సి ఉన్నది. ఇది కూడా అప్పటి కేసీఆర్ హయాంలో ప్రతిపాదించగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టెం డర్లు నిర్వహించకపోవడం గమనార్హం. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలోనే మంజూరైన విషయం ప్రజలకు తెలియజేయడంలో సఫలమయ్యారు. దీంతో పార్టీ మారిన కౌన్సిలర్లకు సెగ తగులుతున్నది. ఆయా డివిజన్లో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులంతా పార్టీ మారిన వారికి టికెట్ ఇస్తే ఓడగొడుతామని ఎమ్మెల్యేకు బహిరంగంగా చెబుతున్నారు. దీంతో పార్టీ మారిన వారికి టికెట్లు దక్కుతాయా లేదా అనేది సంశయాత్మకంగా మారింది. ఇటు బీఆర్ఎస్ను వీడి అటు కాంగ్రెస్‌లోకి వెళ్లిన కౌన్సిలర్లు డైలామాలో పడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ కొత్త నేతలను ప్రోత్సహిస్తుండడంతో కాంగ్రెస్ నేతలు కూడా తమకే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. దీంతో పార్టీ మారిన ఫలితం లేకపోయిందని.. రాజకీయ భవిష్యత్ సమాధి అయ్యేలా ఉందని బాధపడుతున్నా రు. మొత్తంపైన పాలమూరు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు మీదా.. మాదా అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు.
మహబూబ్‌నగర్ ఏ గ్రేడ్ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చాలని కేసీఆర్ ప్రభు త్వ హయాంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిర్ణయం తీసుకొని కౌన్సిల్లో తీర్మా నం కూడా చేయించారు. అప్పటి జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో సంప్రదించి సమీపంలోని గ్రామాలను మున్సిపాలిటీ లో విలీనం చేసి జనాభా ప్రతిపాదికన కా ర్పొరేషన్ స్థాయికి తగ్గట్టు తీర్చిదిద్దారు. దీంతో మహబూబ్‌నగర్ కార్పొరేషన్ జీవో వెలువడనున్న తరుణంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సందర్భంలో కూడా మహబూబ్‌నగర్‌ను కార్పొరేషన్ చేస్తామని హామీ ఇచ్చింది. అధికా రం మారడంతో గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపాదించిన విధంగానే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ దాదాపు ఈ ఏడాది తర్వాత నిర్ణయం తీసుకున్నారు. గతంలో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు 49 వార్డులు ఉండ గా ప్రస్తుతం దీన్ని 60 డివిజన్లకు పెంచా రు. పట్టణంతోపాటు సమీప విలీన గ్రామాలను కూడా కార్పొరేషన్లో కలిపి డివిజన్లు ఏర్పాటు చేశారు.
పాలమూరు కార్పొరేషన్‌గా అవతరించిన అధికార పార్టీ నేతల కనుసన్నల్లో డివిజన్ లో ఏర్పాటు జరిగిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. 60 డివిజన్లు ఏర్పాటు చేసిన అధికారులు ఈ విభజనపై అభ్యంతరాలను ఆహ్వానించారు. అయితే విపక్షాలు ఇచ్చిన అభ్యంతరాలను తోసిపుచ్చి కేవలం అధికార పార్టీకి అనుకూలంగా మాత్రమే డివిజన్ల ఏర్పాటు జరిగిందని బీఆర్ఎస్, బీజేపీతోపాటు వామపక్షాలు కూడా విమర్శించాయి. ప్రస్తుతం ఏర్పాటవుతున్న డివిజన్లన్నీ స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు కలిసి నిర్ణయించినవే అన్న ఆరోపణ లు వస్తున్నాయి. దీంతో డివిజన్లపై వచ్చిన అభ్యంతరాలను తోసిపుచ్చడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతుంది. ఈలోపే కార్పొరేషన్ కమిషనర్‌ను మార్చడం అనుమానాలకు తావిస్తోంది. డివిజన్ల ఏర్పాటులోని అధికార పార్టీ కుట్రలు బట్టబయలు అయ్యాయి.