పెద్దమందడి : వనపర్తి జిల్లా పెద్దమందడి ( Peddamandadi ) మండలంలోని ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో కల్లాల దగ్గర ఆరబెట్టుకున్న వరి ధాన్యం ( Paddy ) మొత్తం తడిసి ముద్దయింది. జంగమయ్యపల్లి, బలిజపల్లి, పామిరెడ్డిపల్లి, దొడగుంటపల్లి, వీరాయపల్లి, చిన్న మందడి తదితర గ్రామాలలో ధాన్యం రాశులపై కవర్లు కప్పినా గాలికి ఎగిరిపోవడంతో మొత్తం ధాన్యం తడిసిపోయింది. పామిరెడ్డిపల్లి వద్ద 33 కెవి విద్యుత్ స్తంబం విరిగిపడింది. దీంతో పలు గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది.
లారీలు లేక కల్లాల దగ్గరనే ధాన్యపు బస్తాలు
కొనుగోలు కేంద్రాలకు సరిగ్గా లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల దగ్గర తూకాలు చేసిన ధాన్యపు బస్తాలు ( Paddy Bags ) కల్లాల దగ్గరనే నిలిచిపోవడంతో తడిసిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనాఅధికారులు, ప్రభుత్వం స్పందించి లారీలను ఎక్కువ సంఖ్యలో పంపించి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని కోరారు.