బిజినేపల్లి : బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించాలని ( Children Enroll ) ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ( Badibata ) కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాల కారుకొండ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో బడిబాట పోస్టర్ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు,రెండు జతల యూనిఫాం,ఉచిత మధ్యాహ్న భోజనం, వారానికి మూడు గుడ్లు, వారానికి మూడుసార్లు రాగిజావ, నాణ్యమైన భోజనం ఇస్తుందన్నారు.
ప్రతి నెల మూడో శనివారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్, ప్రతి నెల నాలుగో శనివారం నో బ్యాగ్ డే వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్పర్సన్ దివ్య,,మాధవి, బాలయ్య, శ్రీనివాస్ గౌడ్, శశికళ, ఇంద్రాణి, భాగ్యలక్ష్మి, శ్రీకాంత్, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.