మూసాపేట, అక్టోబర్ 29 : కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా శనివారం మర్రిగూడ మండలం శివన్నగూ డెం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. కారు గు ర్తుకు ఓటేసి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. అ నంతరం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, పద్మశాలీ సంఘం యాదగిరి, వార్డు సభ్యులు యాదయ్య, సోమయ్య, రంగారెడ్డి, నర్సింహ, గణేశ్, అదేవిధంగా కమ్మగుడానికి చెందిన బీజేపీ నాయకులు రమణ, నరే శ్, కోటిరెడ్డి, ఇన్నయ్య తదితరులు గులాబీ పార్టీలో చే రారు. వీరికి మంత్రి నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గులాబీ కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ నేతలు అధికారం కోసం ఆరాట పడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మాత్రం సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థంతో పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రజలంతా గులాబీ వైపే..
వనపర్తి, అక్టోబర్ 29 : మునుగోడు ప్రజలంతా గు లాబీ పార్టీ వైపే ఉన్నారని, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మంత్రి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మర్రిగూడ మం డలం దామెర భీమనపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి బస చేసి శనివారం ఉదయం పార్టీ గ్రామ అధ్యక్షుడు శీను (దళితుడు) ఇంట్లో అల్పాహారం చేశారు. అనంత రం ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రభుత్వం అమ లు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో వనపర్తి నాయకులు కోళ్ల వెంకటేశ్, పురుషోత్తంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొమ్ము వెంకటస్వామి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశ్, బుద్ధారం మాజీ సర్పంచ్ శివకుమార్ పాల్గొన్నారు.
మునుగోడు కారుదే..
పాలమూరు, అక్టోబర్ 29 : మునుగోడు గడ్డపై కా రుదే విజయమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధీ మా వ్యక్తం చేశారు. శనివారం ఉప ఎన్నికల ప్రచారం లో భాగంగా తాళ్ల సింగారం, లింగోజీగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలుస్తామని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. అలాగే ప్రజలకు బ్యాలెట్ నమూనాను చూపించారు. చౌటుప్పల్ పరిధిలోని తాళ్ల సింగారంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
శివన్నగూడెంలో ఇంటింటి ప్రచారం..
కొత్తకోట, అక్టోబర్ 29 : మునగోడు ఉపఎన్నికల్లో భాగంగా మర్రిగూడ మండలం శి వన్నగూడెం గ్రామంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కే సీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ బుచ్చన్న, కురుమూర్తి, కౌన్సిలర్ సంధ్య, యాదగిరి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్‌రెడ్డి, సాక బాలనారాయణ పాల్గొన్నారు.
పథకాలను వివరిస్తూ..
మిడ్జిల్, అక్టోబర్ 29 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ ల క్ష్మారెడ్డిని కోరారు. మునుగోడు నియోజకవర్గంలో మిడ్జిల్ మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బంగారు తెలంగాణలో భాగ్యస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీజే పీ, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని సూచించారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.