పరిశోధనలో మేటి.. సంస్కృత అకాడమీ
సం స్కృత భాషా ప్రభావం లేని భారతీయ భాష లేదం టే అతిశయోక్తి కాదు. రామాయణ, భారత, భాగవతాదులతో పాటు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు తరువాత వచ్చిన లౌకిక సాహిత్యం కూడా భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయంటే సంస్కృత వైశిష్ట్యం స్పష్టమౌతున్నది అటువంటి సంస్కృత భాషకు చిరునామాగా ఉస్మానియా యూనివర్సిటీలోని సంస్కృత అకాడమీ నిలుస్తున్నది
- భాషా పరిశోధనల కోసం ఏర్పాటు
- ఓయూ సంస్కృత అకాడమీకి ఆదర్శ పరిశోధన సంస్థగా గుర్తింపు
- సామాన్యుల్లోకి సంస్కృతాన్ని తీసుకెళ్లేందుకు అవిరళ కృషి
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 16 : సం స్కృత భాషా ప్రభావం లేని భారతీయ భాష లేదం టే అతిశయోక్తి కాదు. రామాయణ, భారత, భాగవతాదులతో పాటు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు తరువాత వచ్చిన లౌకిక సాహిత్యం కూడా భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయంటే సంస్కృత వైశిష్ట్యం స్పష్టమౌతున్నది అటువంటి సంస్కృత భాషకు చిరునామాగా ఉస్మానియా యూనివర్సిటీలోని సంస్కృత అకాడమీ నిలుస్తున్నది. భాషా ప్రచారానికి, పరిశోధనలకు, అమూల్యమైన గ్రంథాల ముద్రణకు మారుపేరైన సంస్కృత అకాడమీ దేశంలో ప్రసిద్ధి పొందిన ప్రధానమైన సంస్కృత పరిశోధనా సంస్థలలో అగ్రగామిగా మన్ననలను పొందుతున్నది.
పరిశోధనే ధ్యేయంగా..
ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సం స్కృత పరిశోధనే ప్రధాన ధ్యేయంగా ఇప్పటి ఆర్ట్స్ కళాశాల భవనంలోనే 1954 జూలై 21న సంస్కృత అకాడమీని ప్రారంభించారు. నాటి నుంచి సం స్కృత పరిశోధనా రంగంలో విశిష్టమైన స్థానాన్ని సంస్థ సంపాదించుకుంది.
ఇంతింతై.. వటుడింతై..
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ల ప్రోత్సాహం, అకాడమీ డైరెక్టర్ల ఆసక్తితో సంస్కృత భాషా, సాహిత్యరంగాలలో ఎనలేని సేవలందిస్తున్నది. అకాడమీ నిధుల లేమితో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వెలకట్టలేని ఎన్నో సంస్కృత శాస్త్రగ్రంథాలను పద్మశ్రీ ప్రొఫెసర్ పుల్లెల శ్రీరామచంద్రుడు పరిశోధించి, ముద్రించి, అకాడమీని ఉన్నతమైన స్థానానికి తీసుకువచ్చారు. కాగా, ప్రతి ఏటా పుస్తక ప్రచురణ, అకాడమీ అభివృద్ధికి ఓయూ రూ.లక్ష సమకూరుస్తున్నది.
ఎన్నో ఘనతలు..
ఓయూ మెయిన్ లైబ్రరీలోని 2,600 మనుస్క్రిప్ట్లను పరిశోధించి, ఆల్ఫాబెట్ క్రమంలో ఐదు వందల పేజీలతో కేటలాగ్‌ను అకాడమీ ముద్రించింది. ఈ గ్రంథం దేశ విదేశాల్లోని సంస్కృత పరిశోధకులు, పండితులకు ఎంతగానో ఉపయోగపడింది. ఇంతేకాకుండా 1964 నుంచి వివిధ శాస్ర్తాలకు చెందిన 125 గ్రంథాలను అకాడమీ ప్రచురించింది.
పటిష్టమైన గ్రంథాలయం..
సంస్కృత అకాడమీలో వివిధ శాస్ర్తాలకు చెందిన విలువైన 130 మనుస్క్రిప్ట్లు భద్రపరిచారు. వాటిలో సమాజానికి ఉపకరించే వాటిని పరిశోధించి, ప్రచురించేందుకు అవిరళ కృషి కొనసాగుతున్నది. అకాడమీ లైబ్రరీలో సుమారు పదకొండు వేల పుస్తకాలు ఉన్నాయి.
సామాన్య జనంలోకి తీసుకెళ్లేందుకు..
సంస్కృత ప్రచారం కోసం, సంస్కృతాన్ని సా మాన్య జనంలోకి తీసుకువెళ్లేందుకు అకాడమీ ఆ ధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నా రు. అందులో భాగంగానే డిప్లొమా, సర్టిఫికెట్ కో ర్సులను రూపొందించారు. గతేడాది నుంచి ఆన్లై న్ ద్వారా సంస్కృతం భాషను నేర్పుతున్నారు.
ఐదు ప్రాజెక్టులను దక్కించుకున్న అకాడమీ..
కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అమలు చేస్తున్న అష్టాదశి పథకం ద్వారా సంస్కృత అకాడ మీ ఇప్పటివరకు ఐదు ప్రాజెక్టులు దక్కించుకుంది. మనుస్క్రిప్టుల ప్రచురణ, అరుదైన ప్రాచీన సం స్కృత గ్రంథాల పునర్ముద్రణ, ఆయుర్వేదం ద్వారా సంస్కృతం, నెలరోజుల వేసవి సంస్కృత శిక్షణా శిబిరం నిర్వహణ, తెలుగు లిపిలో ముద్రించబడిన సంస్కృత గ్రంథాలను దేవనాగిరి లిపిలో ముద్రించడం వంటి ప్రాజెక్టులను సొంతం చేసుకున్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

