దేవరకద్ర, అక్టోబర్ 16 : సబ్బండ వ ర్గాల సంక్షేమమే తమ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం దేవరకద్ర పట్టణం లో ఎమ్మెల్యే ఆల విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు నిద్ర కరువైందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ప్రణాళిక రూపొందించారన్నారు. ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా’తో 93 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్య రక్ష ద్వారా రూ.15 లక్షల వరకు వైద్యం చేయించుకోవచ్చన్నారు. రైతుబంధు కింద దశలవారీగా ఎకరాకు రూ.16 వేలు అందిస్తామన్నా రు.
సౌభాగ్యలక్ష్మి పేరిట నిరుపేద మహిళలకు ప్రతి నెలా రూ.3 వేలు గౌరవభృతి చెల్లిస్తామన్నారు. రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ, ఆసరా పిం ఛన్ పెంపుదల, అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశా ల, 6,500 ఇండ్ల నిర్మాణం వంటి పథకాలు ఎంతో మేలు చేయనున్నాయన్నా రు. తాను రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గా విజయం సాధించి రూ.కోట్ల నిధుల తో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. 33 చెక్‌డ్యాంలు నిర్మించడంతో భూగర్భజలాలు పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్‌లాంటి విజన్ ఉన్న నాయకుడు ఉన్నందునే ఇదంతా సాధ్యమైందన్నారు. కేం ద్ర ప్రభుత్వం సహకరించకున్నా పీఆర్‌ఎల్‌ఐని పూర్తి చేశామన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రగతినివేదిక, మ్యానిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమిక్కులు చేసినా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి విజ యం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో చేరిన నాయకులు..
కౌకుంట్ల మండలంలోని పేరూర్ గ్రామానికి చెందిన ఓంకార్, గోపాల్, రా మూర్తి, కృష్ణయ్య, శివకుమార్.. ఎమ్మె ల్యే ఆల సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలేని, వారి మాటలు నమ్మి మోసపోవద్ద ని సూచించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని వారు ఇప్పు డు అవకాశం ఇవ్వాలని కోరడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ సుజాత, మా ర్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ, ఎంపీటీసీ తిరుపతయ్య, పార్టీ మండలాధ్యక్షు డు నరసింహారెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, ఖదీర్‌పాషా, శ్రీకాంత్‌యాదవ్, కొండారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయు లు, రంగయ్యగౌడ్, సత్యంసాగర్, వెంకటేశ్, బాలరాజు, భాస్కర్‌రెడ్డి, శివానం ద్, చల్మారెడ్డి, యుగేంధర్‌రెడ్డి, రాధాకృ ష్ణ, సయ్యద్ జక్కి తదితరులున్నారు.
కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అధోగతే..
కొత్తకోట, అక్టోబర్ 16 : కాంగ్రెస్ వ స్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఎ మ్మెల్యే ఆల తెలిపారు. సోమవారం పట్టణంలోని బీసీ హాస్టల్ వద్ద 10,11,12 వార్డులకు చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన యువకులు ఎమ్మెల్యే సమక్షం లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.3వేల పింఛన్ పో యి రూ.200 పింఛన్ వస్తుందని, 3 గంటల విద్యుత్ వస్తుందన్నారు.