మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 16 : జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి తీరును పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎండగట్టారు. పాలమూరులోని అభం.. శుభం తెలియని పేదల ఇండ్లను కూల్చిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలతో ఆరోపణలు చేయిస్తున్నారని నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకన్న ధ్వజమెత్తారు. ఈ సమయంలో పలువురు ఇండ్లు కోల్పోయిన, బ్లయిండ్ అసోసియేషన్ నా యకులు అక్కడకు చేరుకొని ఆవేదన వ్యక్తం చేశా రు. పింఛన్ డబ్బును జమ చేసి ఇల్లు కట్టుకుంటే.. కూల్చేశారని బ్లయిండ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రంగదాస్ వాపోయాడు. నేటి వరకు కూడా స్థా నిక ఎమ్మెల్యే కనీసం తమను పలకరించేందుకు కూ డా రాలేదన్నారు. ఇండ్లు కూలి రోడ్డున పడిన మా పరిస్థితి చూసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిత్యావసర సరుకులు అందించి తమను ఆదుకున్నారని తెలిపారు.
గూడు, గుడ్డలేని తమకు తినడానికి బు క్కెడు అన్నం పెడుతున్నాడన్న సంతోషంలో బతుకుతున్నామన్నారు. అయితే తింటున్న కంచాన్ని ఎమ్మెల్యే లాగేలా వ్యవహరిస్తున్నారని, కడుపునింపుతున్న నేతలపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పట్టించుకోకుంటే కలెక్టరేట్, ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వస్తదని హెచ్చరించారు. అనంతరం బ్లయిండ్ అసోసియేషన్ నాయకుడు మల్ల య్య మాట్లాడుతూ 2013-14లో ఇంటర్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో నా ఇల్లు కూల్చారు. అందులో నేను చదివిన సర్టిఫికెట్లు ఉండగా.. మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడు నేను చదివిన చదువు, ఉండడానికి ఇల్లు లేదు. నేను బతికి ఏం లాభమని బోరున విలపించాడు. నాకు ఇల్లు కట్టించడంతోపాటు ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే నాకు చావే శరణ్యమని వాపోయాడు.