దేవరకద్ర, సెప్టెంబర్ 18 : ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తున్నది. దే వరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ధరలు విపరీతంగా పెరిగాయి. మండలంలోని వివిధ గ్రామా ల శివారుల్లో సాగైన ఉల్లిని రైతులు మార్కెట్కు తీసు కొచ్చారు. దాదాపు 16 క్వింటాళ్లకుపైగా విక్రయానికి రాగా స్థానిక వ్యాపారులతోపాటు బయటి నుంచి వచ్చిన వ్యా పారులు వేలంలో పాల్గొన్నారు.
గరిష్ఠంగా రూ.5 వేలు, క నిష్ఠంగా రూ.4,500 వరకు ధర పలికింది. గత వారం క్విం టా ధర అత్యధికంగా రూ.4 వేలకు పలకగా.. వారం వ్య వధిలోనే రూ.వెయ్యి పెరిగింది.మార్కెట్ నిబంధనల ప్రకారం 45 కేజీలు తూకం వేసి విక్రయించారు. ప్రస్తుతం ఉల్లి ఉత్పత్తి లేకపోవడంతోనే రెం డు వారాల్లోనే ధరలు పైపైకి చేరాయి. కాగా ధరలు పెరగ డంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు.