దేవరకద్ర, జనవరి 8 : మార్కెట్లో ఉల్లిధరలు స్పల్పంగా తగ్గాయి. బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందని రైతులు బుధవారం దేవరకద్ర వ్యవసాయ మార్కెట్కు ఉల్లిని విక్రయించేందుకు భారీగా తీసుకువచ్చారు.
అయితే స్థానిక వ్యా పారులతోపాటు బయటి నుంచి వ్యాపారులు సైతం టెండర్లు వేయడంతో ఉల్లికి గత వారం కంటే స్వల్పం గా గరిష్ఠంగా రూ.3,510; కనిష్ఠంగా రూ.2,260కి తగ్గింది. అయితే మార్కెట్ నిబంధనల ప్రకారం 45 కిలోలు తూకం వేసి విక్రయించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.