లారీని ఢీకొట్టిన బొలెరో
జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉ న్న లారీని బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన ఘటన శనివారం చోటు చేసుకున్న ది.
- ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
- 30 గొర్రెలు మృత్యువాత
జడ్చర్లటౌన్, జనవరి 6 : జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన ఘటన శనివారం చోటు చేసుకున్న ది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి త మిళనాడు వెళ్తున్న ఐరన్‌లోడ్ లారీ జడ్చర్ల పట్టణ శివారులో టైరు పగిలి రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ క్రమంలో వరంగల్ నుంచి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామానికి గొర్రెల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో బొలెరో డ్రైవర్ శేఖర్(35) అక్కడికక్కడే మృతి చెందగా అందులో ఉన్న నిడుగుర్తికి చెందిన రాములు, నర్సింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గుర్తించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో బొలెరోలో ఉన్న 30 గొర్రెలు కూడా మృతి చెందాయి. జడ్చర్ల పోలీసులు ప్రమా ద స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల మార్చురీకి తరలించారు. ఆ తర్వాత ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

