కౌకుంట్ల(దేవరకద్ర)/మానవపాడు/అచ్చంపేటరూరల్, జూలై 5 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన వేర్వేరు ఘటనలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మానవపాడు, దేవరకద్ర మండలాల్లో ట్రావెల్ బస్సులను, లారీ,ట్రక్కు ఢీకొని ప్రమాదానికి గురికాగా, అచ్చంపేట మండలంలో రెండు కార్లు ఢీ కొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
వోల్వో బస్సు ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల సమీపంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు దేవరక ద్ర పట్టణ సమీపంలోని భా రత్ పెట్రోల్ బంక్ దగ్గరలోని మలుపు వద్ద ఎన్‌హెచ్-167పై మంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న భారతి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి రాయిచూర్ వైపు వెళ్తున్న మినీ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నా యి.
దీంతో ట్రక్కు డ్రైవర్ ట్రక్కులో ఇరుక్కొని అక్కడికక్క డే మృతి చెందాడు. వోల్వో బస్సు డ్రైవర్‌కు కాళ్లు విరిగిపోయాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే ట్రక్కులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. గాయాలైన ఇద్దరిని అంబులెన్స్‌లో జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు. ప్రత్యక్ష సాక్షు ల కథనం ప్రకారం ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అనుమానిస్తున్నారు.
అలాగే ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో బస్సు బోల్తాపడిన ఘటన జో గుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని జాతీ య రహదారి 44పై శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ది. బాధితుల కథనం ప్రకారం ఏపీలోని హిందుపురం నుంచి హైదరాబాద్‌కు 22మంది ప్రయాణికులతో మా ర్నింగ్ స్టార్ ట్రా వెల్స్ బస్సు బయలుదేరింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో మానవపాడు స్టేజీ వద్దకు రాగానే అనంతపురం నుంచి జమ్ముకాశ్మీర్ వెళ్తున్న లారీ ట్రావెల్స్ బస్సు ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద ఘటన తెలుసుకున్న 108సిబ్బంది అక్కడకు చేరుకొని బస్సులో గాయపడిన వా రిని బయటకు తీసి కర్నూల్ దవాఖానకు తరలించారు.
ప్ర మాదంలో 10మందికి గాయాలు కాగా వారిలో చిన్నబస వ, వినీత, నవీన్‌కుమార్ రెడ్డి, జ్యోతి, ఘాజీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే అచ్చంపేట మండలంలో చెన్నారం గేటు సమీపంలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, కార్లు ధ్వంసమైన ఘటన చోటు చేసుకున్నది. స్థానికులు కథనం ప్రకారం శ్రీశైలం వైపు నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న కారును స్పీడ్ బ్రే కర్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప లువురికి గాయాలు కాగా గమనించిన స్థానికులు రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారిని బయటికి తీసి చికిత్స నిమిత్తం అ చ్చంపేట సర్కారు దవాఖానకు తరలించారు. స్థానికులు అచ్చంపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని కార్లను అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్సై నరేశ్ తెలిపారు.