గద్వాల : నియోజకవర్గంలోని గద్వాల మండలం బీరెల్లి గ్రామానికి చెందిన పలువురు శనివారం బీఆర్ఎస్ ( BRS ) పార్టీలో చేరారు. బీచుపల్లి మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ( Hanmanth Naidu ) సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో తిమ్మారెడ్డి, పెద్ద వీరన్న, శేఖర్ నాయుడు, ఆటో బోయ వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ నరసింహులు, చాకలి పరశురాముడు, చాకలి సవరన్న, బోయ బీచుపల్లి, టీ.పరశురాముడు, అనిల్, వడ్ల రమేష్, గోపిమేకల బిషన్న,రవికుమార్, రామాంజనేయులు, సూరి, బిషన్న, రాజన్న, ఎర్రన్న, అశోక్, దేవా, వీరన్న, రాజు తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ కార్యకర్తలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.