నారాయణపేట: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని చిట్యాలకు చెందిన సంతోశ్ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున మక్తల్ నుంచి మహబూబ్ నగర్‌కు బైకుపై వెళ్తుండగా పెద్ద చింతకుంట స్టేజి దాటిన తర్వాత ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.