మరికల్ : ఒక్క సీసీ కెమెరా ( CC TV camera ) వంద మంది పోలీసులతో సమానమని మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి ( CI Rajender Reddy ) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పాత కుర్వగేరిలో ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి( Mallikarjuna Swamy Temple) దేవాలయంలో వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీసీ కెమెరాలను ప్రారంభించిన అనంతరం సీఐ మాట్లాడారు. సీసీ కెమెరాలను ప్రధాన కూడళ్లతోపాటు దేవాలయాలు, షాపుల వద్ద ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అంతకు ముందు శివాలయంలో సీఐ, ఎస్సైలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మరికల్ ఎస్సై రాము, వీరశైవ లింగాయత్ నాయకులు జగదీష్, వీరభసంతు, వీరన్న, శరత్ బాబు, శివప్రసాద్, బసన్న, తిప్పయ్య, మల్లికార్జున్, మల్లేష్, వీరేశం, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.